YSR Bheema cm jagan
YSR Bhima Scheme : వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 – 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్తే..రూ. 5 లక్షల సాయం అందచేయనుంది ప్రభుత్వం. జులై 01వ తేదీ నుంచి వైఎస్సార్ బీమా మార్పులతో అమలు కానుంది. జులై 01వ తేదీ లోగా క్లెయిమ్ లను అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సూచించారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. 2021, జులై 09వ తేదీ బుధవారం వైఎస్సార్ బీమా పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకోనుంది. సీఎం వైఎస్ జగన్ 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. బియ్యం కార్డులు కలిగిన వారు మాత్రమే ఈ బీమాకు అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
Read More : Weather Forecast : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు