Weather Forecast : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు

ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Weather Forecast : తెలంగాణలో రాగల 5 రోజులు  వర్షాలు
ad

Weather Forecast : ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు .12,13 తేదీల్లో ఆతి భారీ వర్షములు కురిసే అవకాశం ఉందని అధికాలు వివరించారు.

నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణాల్లో ఈరోజు మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని వచ్చే2,3 రోజుల్లో ఇవి రాష్ట్రమంతా పూర్తిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ ఒడిస్సా నుండి తెలంగాణా మీదగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి.మీ వరకు వ్యాపించి ఉన్నది.

ఈనెల 9,10,11 తేదీల్లో రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర తూర్పు, జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మరోవైపు వరంగల్ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. వరంగల్ అండర్ రైల్వే గేట్ సాకరశి కుంట, ఏకశిలా నగర్, కరీమాబాద్, ఎస్.ఆర్.ఆర్ తోట, ఉర్సు గుట్ట, బి ఆర్ నగర్, శివనగర్, సమ్మయ్య నగర్ పలు కాలనీలు జలమయం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. డ్రెయినేజీలు మూసుకుపోవడంతో రోడ్లపైనే వ‌ర‌ద నీరు భారీగా నిలిచిపోయింది. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల‌తో లోత‌ట్టు ప్రాంత ప్రజ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

కరీంనగర్ జిల్లాలోనూ నిన్న సాయంత్రం నుండి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారి వర్షం పడింది. సాయంత్రం వరకు సాదారణంగా ఉన్న ఆకాశం ఒక్క సారిగా మబ్బులు కమ్మి కొద్ది సేపు వర్షం పడి ఆగిపోయింది. మళ్లీ రాత్రి భారిగా వర్షం కురిసింది. కరీంనగర్ లో రాత్రి భారీగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాలవల నిర్మాణ పనులు జరుగుతుండటం తో వర్షం నీరు ఉదృతంగా వచ్చి పలు కాలనీలలో నీరు ఇళ్లలోకి రావడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.