YS Sharmila Husband Anil Kumar reject Congress Kanduva video viral
Brother Anil Kumar : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ గూటికి చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, కొప్పుల రాజు, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు పాల్గొన్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మల్లిఖార్జున ఖర్గే.. షర్మిలను కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మెడలో కూడా పార్టీ కండువా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. తాను మాత్రమే పార్టీలో చేరుతున్నానని ఖర్గేతో షర్మిల చెప్పినట్టుగా వీడియోలో కనబడుతోంది. తర్వాత ఆ కండువాను రాహుల్ గాంధీ.. షర్మిలకు వేసి పార్టీలోకి స్వాగతించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: సార్ ఎలా ఉన్నారు.. కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్
కాగా, బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ ప్రచారకుడిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి ఆయన తెరవెనుకే ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎపుడూ లేరు. వైఎస్ షర్మిలకు అండగా ఉంటూ రాజకీయాల్లో ఆమెను ప్రోత్సహించారు. తాజాగా షర్మిలతో పాటు ఆయన ఢిల్లీ వెళ్లారు. భార్యతో పాటు అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారని భావించి ఆయనకు ఖర్గే కండువా వేయబోయారు. అయితే తాను పార్టీలో చేరడం లేదని ఖర్గేతో అనిల్ చెప్పారు.
Also Read: షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?