షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

వైఎస్ కుటుంబంలోకి వచ్చే అట్లూరి ప్రియా బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

YS Raja Reddy Atluri Priya

Updated On : January 1, 2024 / 3:21 PM IST

Ys Raja Reddy Atluri Priya Wedding: నూతన సంవత్సరం వేళ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక విషయాన్ని వెల్లడించారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుక తేదీ, తనకు కాబోయే కోడలు వివరాలను ట్విటర్ వేదికగా వెల్లడించారు. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, అట్లూరి ప్రియాతో ఈనెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరుగుతుందని చెప్పారు. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని షర్మిల తెలిపారు.

Also Read : Sitara Ghattamaneni : న్యూ ఇయర్ సితార పాప స్పెషల్ ఫొటోషూట్..

షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు. విదేశాల్లో ఓ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఆ సమయంలో వారితో తీసుకున్న ఫొటోలను షర్మిల ఇటీవల తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, అట్లూరి ప్రియాతో వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికితోడు ప్రియా, రాజారెడ్డి కలిసితీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రాజారెడ్డి యూఎస్ కు వెళ్లినప్పుడు ప్రియా అట్లూరి పరిచయం కావడం, స్నేహితులుగా మారడం, కొంతకాలం తరువాత వారి స్నేహం ప్రేమగా మారినట్లు తెలిసింది. అయితే, ఈ ప్రేమికులిద్దరూ తమతమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

Also Read : Star Hero Big Movies : 2024లో రాబోయే తెలుగు స్టార్ హీరోల భారీ సినిమాలు ఇవే..

వైఎస్ కుటుంబంలోకి వచ్చే అట్లూరి ప్రియా బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఎక్కడ నివాసం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, అట్లూరి ప్రియా చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది. కానీ, ప్రియా అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని మరో వార్త కూడా వినిపిస్తోంది. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా అని, అట్లూరి శ్రీనివాస్ కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలుకూడా చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారట. అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుంది.