Star Hero Big Movies : 2024లో రాబోయే తెలుగు స్టార్ హీరోల భారీ సినిమాలు ఇవే..
2024పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం లైన్లో ఉన్న భారీ మూవీస్ అలాంటి ఇలాంటి మూవీస్ కాదు. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోంది.

2024 upcoming Tollywood Star Hero Movies Full Details
Star Hero Big Movies : 2023లో రావాల్సిన కొంతమంది స్టార్ హీరోల సినిమాలు అలా.. అలా ముందుకు వెళ్లిపోయాయి. అందుకే 2024పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం లైన్లో ఉన్న భారీ మూవీస్ అలాంటి ఇలాంటి మూవీస్ కాదు. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోంది.
2024 స్టార్టింగ్ లోనే ఆడియన్స్ కి ఘాటెక్కించే గుంటూరు కారం(Guntur Kaaram) రుచి చూపించబోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). కుర్చీ మడతెట్టి కొడితే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయంటున్నాడు. ఈసారి సూపర్ స్టార్ మాస్ కొట్టుడు మామూలుగా ఉండేట్టు లేదు. 2023లో ఊరించి ఊరించి 2024 సంక్రాంతి బరిలోకి వెళ్లిపోయింది గుంటూరు కారం మూవీ. మాస్ డైలాగులు.. మాస్ ఫైటింగులు.. ఆ మాస్ స్టెప్పులు చూస్తుంటే గుంటూరు కారం ఘాటెక్కించేలాగే ఉంది. మాస్ ఆడియన్స్ కి మాంచి కిక్కిచ్చేలాగే ఉంది. ఓవైపు సంక్రాంతి పండగ.. మరోవైపు సూపర్ స్టార్ సినిమా పండగ.. పైగా త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో 2024లో ఎంటర్టైన్మెంట్ కి మాంచి కిక్ స్టార్ట్ ఇవ్వబోతుంది గుంటూరు కారం.
ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1
2024 మొదట్లో సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ ఘాటు ఎక్కిస్తే సమ్మర్ లో ఎన్టీఆర్ దేవరతో(Devara) మండించనున్నాడు. RRR సినిమాలో టైగర్ తో యంగ్ టైగర్ ఫైట్ చూశాక పాన్ ఇండియా షేక్ అయ్యింది. ఎన్టీఆర్(NTR) యాక్టింగ్ కి అంతా ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాతే వెయిటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2023 నుంచి అలా అలా ముందుకు వెళ్లిపోయి 2024లో తుఫాను సృష్టించబోతున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్.. భారీ క్యాస్టింగ్.. మరోవైపు RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా. అందుకే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడం, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. 2024 ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీటీం. లేటెస్ట్ గా హీరో కళ్యాణ్ రామ్ సైతం దేవర మూవీ.. హాలివుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి ఉంటుందన్నాడు.
15న పుష్ప సెకెండ్ పార్ట్
ఇక తగ్గదేలే.. అంటూ పుష్ప ఫస్ట్ పార్ట్ తో అందరినీ రఫ్పాడించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా 2024లో మాస్ జాతర చేయబోతున్నాడు. శేషాచలం ఫారెస్ట్ లో పుష్పరాజ్(Pushpa 2) రూలింగ్ ఎట్టా ఉంటుందో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మరోసారి అన్ని ఇండస్ట్రీస్ లో ఫైర్ పుట్టించేందుకు.. లెక్కల మాస్టార్ తో కలికి పక్కాగా దిగబోతున్నాడు. 2023లోనే పుష్పరాజ్ ఎక్కడా.. ఎక్కడా అంటూ చాలామంది వెతికారు. కానీ సిసి కెమెరాల్లో కనిపించి మాయమైపోయాడు. అలా 2023లో మిస్సయిన పుష్పరాజ్.. 2024లో ఫైర్ పుట్టించబోతున్నాడు. ఒక్క సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా పుష్ప సెకెండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే తగ్గేదేలే అన్నట్టు రెండేళ్ల నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్నాడు సుకుమార్. 2024 ఆగష్టు 15న పుష్ప సెకెండ్ పార్ట్ ని రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేసింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పుష్పరాజ్ గంగమ్మ అవతార్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 204 లో మరోసారి పుష్పరాజ్ విశ్వరూపం చూపించేట్టే ఉన్నాడు.
Also Read : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్? ప్రియుడితో పెళ్లి ఆ రోజే..
దసరాకు ప్రభాస్ కల్కీ
2023 ఎండింగ్ లో.. సలార్ మూవీతో బ్లాస్టింగ్ హిట్ కొట్టిన ప్రభాస్(Prabhas).. 2024లో కూడా అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. అదిగో ఇదిగో అంటూ ముందుకు వెళ్లిపోయినా పాన్ వరల్డ్ మూవీ కల్కి.. 2024లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. పెద్ద పెద్ద స్టార్సంతా కలిసి నటిస్తున్న కల్కీ(Kalki 2898AD).. బాక్సాఫీస్ దెగ్గర పెద్ద ఆటంబాంబులా పేలబోతోంది. భారీగా తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి కూడా 2024 బరిలోనే ఉంది. సలార్ లో ప్రభాస్ డైనోసర్ లా రెచ్చిపోతే.. కల్కిలో డైనోసర్ జేజమ్మలా కనిపించబోతున్నాడంటూ ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన కల్కి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలివుడ్ రేంజ్ అంటూ అంతా ఆహా అంటున్నారు.
అందుకు తగ్గట్టే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎక్కడా తగ్గకుండా సినిమా తీస్తున్నాడట. లెక్క ఎక్కువైనా పర్వాలేదు కాని తక్కువ కాకుండా చూసుకుంటున్నారట. అందుకే.. 2023లో రావాల్సిన మూవీ 2024లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ ఒక్కడుంటేనే సినిమాకి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వస్తుంది. అలాంటిది కల్కిలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపిక, రానా, దిశా.. ఇలా పాన్ ఇండియా స్టార్స్ చాలామంది నటిస్తున్నారు. 2024 సంక్రాతికి రిలీజ్ అన్నారు అది కూడా వాయిదాపడి ఇప్పుడు దసరాకే అనే టాక్ వినిపిస్తోంది. సో.. పక్కాగా ఎప్పుడొస్తుందో చెప్పకపోయినా.. కాస్త అటో ఇటో 2024లో కల్కి రావడమైతే పక్కా అని తెలుస్తోంది.
సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్
2024 లో అందరూ ఎదురు చూస్తున్న మరో భారీ సినిమా గేమ్ ఛేంజర్. RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న గేమ్ చేంజర్(Game Changer) పై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ డైరెక్టర్ శంకర్ మాత్రం షూట్ లేట్ చేస్తూ వాళ్ళని నిరుత్సాహపెడుతున్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం చరణ్ డ్యూయల్ రోల్ లో పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని చెర్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ అటు ఇండియన్ 2.. ఇటు గేమ్ ఛేంజర్ రెండు సినిమాల్ని హ్యాండిల్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల దిల్ రాజు గేమ్ ఛేంజర్ 2024 సెప్టెంబర్ లో వస్తుందని చెప్పాడు. అప్పటిదాకా చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.