Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్? ప్రియుడితో పెళ్లి ఆ రోజే..

రెండేళ్ల క్రితం 2021 లోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ప్రేమలో పడ్డానని, అతన్ని ప్రేమిస్తున్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు రకుల్ ప్రీత్ అధికారికంగానే ప్రకటించింది.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్? ప్రియుడితో పెళ్లి ఆ రోజే..

Rakul Preet Singh Jackky Bhagnani Marriage Rumours goes viral in Bollywood

Updated On : January 1, 2024 / 12:02 PM IST

Rakul Preet Singh Marriage : తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది రకుల్ ప్రీత్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇక్కడ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ. బాలీవుడ్(Bollywood) లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది రకుల్ ప్రీత్.

రెండేళ్ల క్రితం 2021 లోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో(Jackky Bhagnani) ప్రేమలో పడ్డానని, అతన్ని ప్రేమిస్తున్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు రకుల్ ప్రీత్ అధికారికంగానే ప్రకటించింది. దీంతో రకుల్ అప్పట్లోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ రకుల్ ఇప్పుడే పెళ్లి చేసుకోము అని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ప్రేమ పక్షులు ఒక్కటి అవ్వబోతున్నారు.

Also Read : Niharika : కొత్త నృత్యం నేర్చుకున్న నిహారిక.. సీక్రెట్ రివీల్ చేసిన మెగా డాటర్..

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2024 ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గోవా వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు, కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుకలు చేసుకొని ముంబైలో గ్రాండ్ బాలీవుడ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే పెళ్లిపై అధికారికంగా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ.. ఇద్దరూ స్పందించలేదు. మరి గత కొన్నాళ్లుగా వరుసగా బాలీవుడ్ లో పెళ్లిళ్లు చేసుకొని ఒకటవుతున్నజంటల లిస్ట్ లో రకుల్ కూడా చేరుతుందా? లేక ఇంకొన్ని రోజులు ఇలాగే ప్రేమలో మునిగితేలుతారా ఈ జంట అనేది తెలియాలి.