Gannavarm : గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు.. ప్లాన్ మార్చిన వైసీపీ!

టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.

ysr congress party special focus on gannavarm politics

Gannavarm Politics:ఏపీలో అధికార వైసీపీకి గన్నవరం టెన్షన్ పట్టుకుంది. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న అధికార పార్టీకి ఈ మధ్య షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. టీడీపీ ఎమ్మెల్యే వంశీమోహన్‌ను (Vallabhaneni Vamsi Mohan) పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో ఆయననే అభ్యర్థిగా పెట్టి గెలవాలని టార్గెట్ పెట్టుకుంది వైసీపీ. కానీ, స్థానిక నాయకులు ఎమ్మెల్యే వంశీని వ్యతిరేకిస్తుండటమే కాక.. ఆయనకు పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) పార్టీకి గుడ్‌బై చెప్పేయగా.. మరోనేత దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandrarao) వైఖరి అంతుచిక్కక టెన్షన్ పడుతోంది వైసీపీ.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని (Vallabhaneni Balasouri) రంగంలోకి దింపి గన్నవరంలో పరిస్థితులు చక్కదిద్దే బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు నియోజకవర్గంపై పెద్దగా దృష్టిపెట్టని వైసీపీ ఇప్పుడు ప్లాన్ మార్చిందా?

గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి. కీలకనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్‌బై చెప్పడం, మరోనేత దుట్టా రామచంద్రరావు అలక పాన్పు ఎక్కడంతో సందిగ్ధంలో పడింది వైసీపీ. మున్ముందు ఇవే పరిస్థితులు కొనసాగితే కష్టమని భావించిన అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే వంశీ, ఆయన వ్యతిరేక వర్గంగా చీలిపోయిన పార్టీని ఒకే తాటిపైకి తీసుకురాడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసింది.

మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని రంగంలోకి దింపి గన్నవరం రాజకీయాన్ని చక్కదిద్దే బాధ్యత అప్పగించింది. ఇన్నాళ్లు ఈ గ్రూపు రాజకీయాన్ని పెద్దగా పట్టించుకోని వైసీపీ హైకమాండ్.. ఇప్పుడు బాలశౌరిని పంపడం ద్వారా అలెర్ట్ అయినట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి ఎప్పుడూ స్థానిక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కొంతకాలంగా గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ, ఆయన వ్యతిరేకుల మధ్య ఉప్పు-నిప్పులా రాజకీయం నడిచినా.. ఎప్పుడూ కలగజేసుకోలేదు ఎంపీ బాలశౌరి.. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి అసంతృప్త నేత దుట్టా రామచంద్రరావుతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.

Also Read: తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి చెల్లెమ్మా.. పురందేశ్వరిపై విజయసాయి ట్వీట్

గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ, కీలక నేతలు యార్లగడ్డ, దుట్టా కలిసి పనిచేస్తేనే టీడీపీని ఓడించగలమని భావించింది వైసీపీ… ఇప్పుడు యార్లగడ్డ చేజారిపోవడంతో దుట్టాపై ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేసేది లేదని గతంలోనే తేల్చిచెప్పేసిన దుట్టాను బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించింది. గన్నవరంలో కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ ఓట్ల ప్రభావం ఎక్కువ. ఎమ్మెల్యే వంశీమోహన్ కమ్మ సామాజికవర్గం కాగా, కాపు, బీసీ, ఎస్సీ ఓట్ల సమీకరణపై ఇప్పుడు దృష్టిపెట్టింది వైసీపీ అధిష్టానం. కాపు నేత దుట్టా రామచంద్రరావును లైన్‌లో పెట్టి ఎమ్మెల్సీ వంశీమోహన్‌కు లైన్‌క్లియర్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతానికి దుట్టా సైలెంట్‌గా ఉన్నా.. ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేసే పరిస్థితి లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుట్టా స్తబ్ధుగా ఉండాలనే కోరుకుంటోంది వైసీపీ అధిష్టానం.

Also Read: ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి?

దుట్టా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేయకపోతే చాలని.. మిగిలిన పని అంతా చూసుకోవచ్చని భావిస్తోంది వైసీపీ. ఇప్పటికే యార్లగడ్డ వెంకట్రావును టీడీపీ లాగేసుకోగా.. దుట్టాపై జనసేన వల వేస్తోందనే ప్రచారం ఉంది. కాపు నేత కనుక.. ఆయన కూడా పవన్ నాయకత్వంపై మమకారం పెంచుకునే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ ముందుగానే రంగంలోకి దిగి దుట్టాను నిలుపుకోవాలని చూస్తోందంటున్నారు పరిశీలకులు.

Also Read: మరోసారి నగరి వైసీపీలో గ్రూప్ విబేధాలు.. మంత్రి రోజా ఫొటో లేకుండా ఫ్లెక్సీలు

వాస్తవానికి మాజీ సీఎం వైఎస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న దుట్టా.. వైసీపీని వీడే పరిస్థితి లేదంటున్నారు. కానీ, వంశీతో సర్దుకుపోయే మనిషి కాదంటున్నారు. దీంతో గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే వంశీకి నష్టం వాటిల్లకుండా.. దుట్టాను కాపాడుకోవడం.. ఆయనను సంతృప్తపరచడంపైనే గన్నవరంలో వైసీపీ విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఈ బాధ్యతలు ఎంపీ బాలశౌరికి అప్పగించడాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. దుట్టా, బాలశౌరి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తమ పని తేలిక అవుతోందని భావిస్తోంది వైసీపీ.. మరి బాలశౌరి దౌత్యం ఫలిస్తుందా? దుట్టా మెత్తబడతారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు