Nagari YCP : మరోసారి నగరి వైసీపీలో గ్రూప్ విబేధాలు.. మంత్రి రోజా ఫొటో లేకుండా పట్టణంలో ఫ్లెక్సీలు

సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Nagari YCP : మరోసారి నగరి వైసీపీలో గ్రూప్ విబేధాలు.. మంత్రి రోజా ఫొటో లేకుండా పట్టణంలో ఫ్లెక్సీలు

Roja

Updated On : August 28, 2023 / 12:46 PM IST

Nagari YCP Group Disputes : చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో మరోసారి గ్రూప్ విబేధాలు బయటపడ్డాయి. సీఎం జగన్ సభ నేపథ్యంలో మంత్రి రోజా ఫొటో లేకుండా పట్టణంలో వైసీపీ రెబల్ నేతలు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రి రోజా, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి ఇద్దరినీ కలపడానికి సీఎం జగన్ యత్నించారు.

Revanth Reddy : దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.. మా డిక్లరేషన్ : రేవంత్ రెడ్డి

ఇద్దరి చేతులు పట్టుకొని, ఒకరి చేతిలో మరొకరి చేయి వేయడానికి సీఎం జగన్ ప్రయత్నం చేశారు. అయితే మంత్రి రోజా, కేజే శాంతి ముభావంగానే చేతులు కలిపారు. నగరికి చెందిన కేజే శాంతి వర్గానికి, మంత్రి రోజాకు చాలా కాలంగా విబేధాలు ఉన్నాయి.