Atmakur Bypoll Results : ఆత్మకూరులో మేకపాటి ఘన విజయం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్  రెడ్డి 82,742 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.

Atmakur Bypoll Results : ఆత్మకూరులో మేకపాటి ఘన విజయం

Mekapati Vikrama Reddy

Updated On : June 26, 2022 / 12:37 PM IST

Atmakur Bypoll Results :  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్  రెడ్డి 82,888 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.  ఈ రోజు ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ ఆయనకే మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి  విక్రమ్ రెడ్డి  విలేకరులతో మాట్లాడుతూ ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు…. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్‌ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ ఏ రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీకి పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. ఈ ఫలితంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ వరుస ఓటముల పాలైంది.

గతంలో తిరుపతి, బద్వేలు, తాజాగా ఆత్మకూరులో అదే ఫలితం పునరావృతం అయ్యింది. ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82, 888 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు. మేకపాటి విక్రమ్‌రెడ్డికి పోలైన ఓట్లు- 102240, (మెజారిటీ -82,888) బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కి పోలైన ఓట్లు- 19352 .