YSR Farmers Insurance:అన్నదాతలకు అండగా.. రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు బీమా డబ్బులు

YSR farmers insurance:రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం‌. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాత‌ల‌ైకు అండగా.. వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని చెల్లించనుంది ప్రభుత్వం. 2020 ఖరీఫ్‌ సీజన్‌ పంటల బీమా డబ్బులను నేరుగా వారి అకౌంట్లోకి జమ చెయ్యనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అర్హులైన 11 లక్షల 59 వేల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి 310 కోట్లను సీఎం జగన్ ఆన్‌లైన్‌ ద్వారా అకౌంట్లో వెయ్యానున్నారు.

ఖరీఫ్‌కు సంబంధించి 15 లక్షల 15 వేల మంది లబ్ధిదారులకు వెయ్యి 820 కోట్ల మేర బీమా మొత్తాన్ని అనౌన్స్ చేసింది సర్కార్‌. అందులో ఇవాళ ఒకరోజే 11 లక్షల 59 లక్షల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి 310 కోట్లు జమ కానున్నాయి. మిగిలిన 3 లక్షల 56 వేల 93 మందికి సంబంధించి బయోమెట్రిక్.. సాంకేతిక సమస్యలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వారి ఖాతాల్లోనూ జూన్ మొదటి వారంలో 510 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద 21 రకాల పంటలకు బీమా కల్పిస్తోంది. వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలకు సంబంధించి 35 లక్షల 75 వేల హెక్టార్లకు బీమా కల్పించింది. ప్రభుత్వ వాటాతో పాటు.. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. నోటిఫైడ్‌ చేసిన పంటల సాగుదారుల వివరాలను ఈ-పంట వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

రైతులపై ఎటువంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి కన్నబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా 37 లక్షల 25 వేల మంది రైతులను బీమా పరిధిలోకి తెచ్చినట్లు కన్నబాబు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు