YSR Jagananna Chedodu : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10వేలు.. రేపు జగనన్న చేదోడు రెండో విడత జమ

ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రెండో విడతలో 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.285 కోట్లు..

YSR Jagananna Chedodu : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10వేలు.. రేపు జగనన్న చేదోడు రెండో విడత జమ

Ysr Jagananna Chedodu

Updated On : February 7, 2022 / 5:02 PM IST

YSR Jagananna Chedodu : జగనన్న చేదోడు పథకం కింద రెండో విడత నగదు లబ్దిదారుల ఖాతాల్లో రేపు(ఫిబ్రవరి 8) జమ కానుంది. ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుండగా.. సీఎం జగన్ బటన్ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు. ఈసారి ఈ పథకం కింద 1.46 లక్షల మంది టైలర్లు, 98వేల మంది రజకులు, 40వేల మంది నాయీ బ్రాహ్మణులను ఎంపిక చేశారు. రెండో విడతలో మొత్తం 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు.

షాపులున్న ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మంగళవారం వేయబోయే రెండో విడుత నగదుతో కలిపి.. ఇప్పటివరకు జగనన్న చేదోడు కింద రూ.583 కోట్లు విడుదల చేసినట్లు అవుతుంది.

Brisk Walk : వేగవంతమైన నడకతో….. గుండె ఆరోగ్యం మెరుగు

అన్ని వర్గాల ప్రజల కోసం జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తోంది. ప్రతి నెల వివిధ పథకాల కింద ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తోంది. ఈ ఏడాది మొదటగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్ర వర్ణాల్లోని పేద మహిళల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేసింది ప్రభుత్వం.

ఫిబ్రవరి నెలలోనూ పలు పథకాల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరిలో మూడు పథకాలను అమలు చేయనుంది. జగనన్న చేదోడు పేరుతో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి చేకూర్చనుంది. వీరిలో అర్హులకు రూ.10వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. కుల వృత్తులకు సంబంధించి షాపులు ఉండి సరైన అర్హతలుంటే ఈ పథకం వర్తిస్తుంది. అర్హులు వాలంటీర్ల ద్వారా నేరుగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక రైతలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ ఇన్‌ పుట్‌ సబ్సిడీ మొత్తాన్ని కూడా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్‌లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయనుంది. ఫిబ్రవరి 15న సీఎం జగన్ రైతుల ఖాతాల్లో ఆన్ లైన్ ద్వారా నగదు ట్రాన్స్ ఫర్ చేయనున్నారు.

ఇక ఇదే నెలలో జగనన్న తోడు పథకం పేరుతో చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. ఫిబ్రవరి 22న ప్రారంభించే ఈ పథకాన్ని మొత్తం 16లక్షల మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే 10లక్షల మందికి వర్తిస్తున్న ఈ పథకాన్ని అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తోపుడు బండ్లు, చిన్నచిన్న బడ్డీకొట్ల నిర్వహణ ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వారు, చిరు వ్యాపారులు వాలంటీర్ల ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?

మార్చి నెలలో రెండు పథకాలను అమలు చేయబోతోంది ప్రభుత్వం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన నిధులు చెల్లించేలా మార్చి 8న జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి సంబంధించిన వాయిదా మొత్తం చెల్లించనుంది. అలాగే మార్చి 22న హాస్టల్ బిల్లులకు సంబంధించి జగనన్న వసతిదీవెన పథకాన్ని ప్రారంభించనుంది.

అన్ని వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే వివిధ రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా.. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారు.