YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలో రూ.15వేలు.. బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకోకుండా ఏర్పాట్లు

కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది

YSR Kapu Nestham : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం(జూలై 22,2021) లాంఛనంగా ప్రారంభించనున్నారు. మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వైఎస్సార్‌ కాపునేస్తం సొమ్ము నేరుగా జమకానున్నాయి.

రెండో ఏడాది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్థికసాయం అందనుంది. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో నగదు జమ కానుంది. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తోంది. గతేడాది ఈ పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ పేద మహిళలకు ఈ పథకం వరం అని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం అందించనున్నట్లు జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కసరత్తు చేయించారు. గతేడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పేరిట పథకానికి తొలి అడుగు వేశారు. ఈ సామాజిక వర్గంలోని పేద మహిళల మోమున చిరునవ్వులు పూయించారు.

ట్రెండింగ్ వార్తలు