YSR Life Time Awards : నేడు వైఎస్సార్ అవార్డులు ప్రదానోత్సవం.. ముఖ్యఅతిథులుగా గవర్నర్, సీఎం జగన్, వైఎస్ విజయమ్మ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య-2022 అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందచేయనున్నారు.

YSR Life Time Awards : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య-2022 అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందచేయనున్నారు. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా, సీఎం జగన్, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు అంద చేస్తోంది.

CM Jagan On Meters : రైతులకు పైసా ఖర్చు ఉండదు, పైగా బోలెడు ప్రయోజనాలు.. మోటర్లకు మీటర్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు 20 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022” కింద 30 అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేస్తారు.

వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు ప్రదర్శించి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలను అవార్డులు వరించాయి. అందులో భాగంగా వ్యవసాయంలో 5, కళలు మరియు సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రధానం చేయనున్నారు.

YS Sharmila Comments On Jagan : ఏపీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషి చేసి, విశిష్టసేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకే అవార్డుల్లో రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దపీట వేశారు. 20 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను 35 మంది వ్యక్తులు, సంస్థలకు అందచేస్తారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద ఎంపికైన వారికి 10 లక్షల నగదు బహుమతి, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అంద చేస్తారు. వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు క్రింద ఎంపికైన వారికి రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందచేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు