Alla Ramakrishna Reddy: వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. ఈ కేసులో ఆర్కే 127వ ముద్దాయిగా ఉన్నారు. ఇక వైసీపీకి చెందిన మరో సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని 120వ నిందితుడిగా పేర్కొంటూ రెండు వారాల కింద సీఐడీ విచారణ ప్రారంభించింది. మరోవైపు కొందరు నిందితులు అరెస్ట్ నుంచి కోర్టు ద్వారా రక్షణ పొందిన నేపథ్యంలో వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
2021లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో సీఐడీ అధికారులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అక్టోబర్ 19, 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల బృందం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసింది. ఆ సమయంలో తీవ్ర అల్లకల్లోలం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును తదుపరి దర్యాప్తు కోసం CIDకి బదిలీ చేసింది. ఆ తర్వాత CID ఈ విషయంపై దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసింది.
Also Read: టీడీపీ మహానాడులో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం వెనుక చంద్రబాబు మార్క్ వ్యూహం..!