Gossip Garage: టీడీపీ మహానాడులో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం వెనుక చంద్రబాబు మార్క్ వ్యూహం..!
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..

Gossip Garage: పార్టీ సంబరం. మూడ్రోజుల మహా వేడుక. ఎన్నో అంశాలు..మరెన్నో ఎజెండాలు ప్రకటించిన టీడీపీ మహా సంబరంలో..ఫైనల్ టచ్ స్పీచ్‌లో తన మార్క్ చూపించారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రస్తావన తెస్తూ..తమ పార్టీ వేడుకలో మోదీ పాలనను హైలైట్ చేస్తూ..సీనియారిటీని చూపిస్తున్నారు. రాజకీయం కంటే నవ్యాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ ఏంటి? ఓవైపు డెవలప్‌మెంట్.. ఇంకోవైపు పొలిటికల్ స్కెచ్ ఉందా?
చంద్రబాబు. ఆయన మార్క్ అభివృద్ధే వేరు. పొలిటికల్ వ్యూహలే సెపరేటు. 35 ఏళ్ల రాజకీయ అనుభవం, అంతకు మించి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్‌తో ఎప్పుడేం చేయాలి..ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. అంతలా స్ట్రాటజీ ప్లే చేసి వర్కౌట్ చేస్తూ వస్తుండటం బాబు స్పెషాలిటీ. అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్స్ విషయంలో చంద్రబాబుకు తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి ఆల్ ఇండియా లెవెల్‌లో ఆయన చక్రం తిప్పుతున్నారు.
కేంద్రంలో బీజేపీకి 240 సీట్లే రావడంతో..మిత్రపక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో టీడీపీకి ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు చెప్పిందే వేదం అనే పరిస్థితి. ఆయనే కింగ్ మేకర్ అయినట్లు మారింది రాజకీయం. అయినా ఆయన ఏ మాత్రం లైన్ దాటడం లేదు. తన అవసరం ఉందన్న స్థాయి డిమాండ్లు కూడా చేయట్లేదు. బీజేపీతో, మోదీతో సఖ్యతతో ఉంటూ..ఏపీ అభివృద్ధికి స్ట్రాంగ్ పునాదులు వేస్తున్నారు.
మహానాడు వేదికపై మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం..
తన పార్టీకి పదవులు, తన రాజకీయ అవసరాల కంటే..నమ్మి అధికార మిచ్చిన ప్రజల ఆశలు నెరవేరాలంటే..కేంద్రం నుంచి నిధులు రావాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. అందుకే నో ఇగోస్..ఓన్లీ డెవలప్‌మెంట్ పాలసీ అంటూ ముందుకెళ్తున్నారు. మహానాడు వేదికపై మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం కూడా ఆయన మార్క్ స్ట్రాటజీ అంటున్నారు. నిజానికి మహానాడు అనేది టీడీపీ పార్టీ పండుగ. అయినా ఆ వేదిక కూటమి ప్రస్తావన తెస్తూ..మోదీ పాలనను పొగిడి..కూటమి అవసరాన్ని..ఏపీ అభివృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్తున్న తీరును చెప్పకనే చెప్పారు చంద్రబాబు.
రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా..చంద్రబాబు కేంద్రంతో లావాదేవీల తరహా సంబంధాన్ని నడుపుతున్నారనేది ఎక్స్‌పర్స్ట్ అభిప్రాయం. గతంలో యునైటెడ్ ఫ్రంట్, వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వాలకు మద్దతిచ్చిన అనుభవం, తనకున్న పరిపాలనా దక్షతతో..ఏపీకి నిధులు తెస్తున్నారు. బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం రాష్ట్ర అభివృద్ధి ఎజెండానే అంటున్నారు.
అదే ఎన్డీయే కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే కేంద్రాన్ని, బీజేపీని వాడుకుంటున్నారన్న చర్చ ఉంది. బాబు మాత్రం అందుకు భిన్నంగా..బీజేపీకి దగ్గరగా..ఏపీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా వ్యవహరిస్తున్నారన్న ఒపీనియన్స్ ఉన్నాయ్. 2024 జూన్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు ఢిల్లీ వెళ్లే వరకు ఆయన స్టాండ్ ఏంటో క్లారిటీ లేక పొలిటికల్ సస్పెన్స్ కంటిన్యూ అయింది. మోదీనే తమ నాయకుడని చెప్పి..అన్ని ఊహాగానాలకు తెరదించి ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు చంద్రబాబు. మహానాడులో కేంద్రమంత్రి పెమ్మసాని చెప్పినట్లు కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టడంలో కూడా తన మార్క్ చూపిస్తున్నారు టీడీపీ అధినేత.
Also Read: వైసీపీకి జూన్ టెన్షన్.. కీలక నేతల అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో పరేషాన్..
అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసిన బాబుకు..ఢిల్లీ స్థాయిలో ఏపీకి సంబంధించిన ప్రయోజనాలను ఎలా పొందాలో వ్యూహాత్మక ప్లాన్స్ అమలు చేస్తారనడంలో డౌటే లేదు. ఏపీ అభివృద్ధి కోసం బాబు ఏదైనా అడిగితే కేంద్ర మంత్రులు కాదనలేని పరిస్థితి. అది అమరావతి రింగ్‌రోడ్ అయినా..రాజధాని అభివృద్ధి కోసం నిధులైనా..కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి నిధులు తెస్తున్నారు. అలా తన అనుభవం, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఫ్యూచర్ బేస్డ్ డెవలప్‌మెంట్ ప్లాన్స్‌తో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు చంద్రబాబు. అందుకే బాబు రూటే సెపరేటు అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.