Gossip Garage: వైసీపీకి జూన్ టెన్షన్.. కీలక నేతల అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో పరేషాన్..
అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం కాకుండా..న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Gossip Garage: ఓ వైపు లిక్కర్ ఫైల్స్. ఇంకోవైపు మైనింగ్ కేసు. మరోవైపు మర్డర్ కేసులు. ఇలా ఒక్కో వైసీపీ లీడర్‌ను ఒక్కో కేసు వెంటాడుతోంది. లేటెస్ట్‌గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌తో మరోసారి వైసీపీ శిబిరంలో గుబులు మొదలైందట. ఫ్యాన్ పార్టీకి జూన్ టెన్షన్ పట్టుకుందట. ఇంతకీ వచ్చే వారంలో ఏం జరగబోతోంది? ఏ కేసులో ఎవరి అరెస్టులు ఉంటాయి? కొత్త కేసు ఏదైనా తెరమీదకు రాబోతోందా?
ఏపీ పాలిటిక్స్ సమ్‌థింగ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో..ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో కూడా ఊహకందని పరిస్థితి. అందుకు తగ్గట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ లీడర్లను ఒకదాని తర్వాత మరో కేసు వెంటాడుతోంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌తో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందట. ఇదే సమయంలో పిన్నెళ్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది.
ఇప్పటికే చాలామంది వైసీపీ నేతలపై కేసులు ఫైల్ అయ్యాయి. వల్లభనేని వంశీ పలు కేసుల్లో జైలులోనే ఉంటూ..బెయిల్ కోసం లీగల్ ఫైట్ చేస్తున్నారు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని లేటెస్ట్‌గా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక పిన్నెళ్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలవీడులో ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో సోదురులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరు మాత్రమే కాదు..ఇప్పటికే పేర్నినాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలినాని..ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ నేతలంతా లీగల్ టీమ్‌ను పెట్టుకుని కోర్టులకు తిరుగుతున్నారు.
రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం కాకుండా.. న్యాయపరంగా అన్ని అవకాశాలు..
అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం కాకుండా..న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాదు గతంలో వారు చేసిన అక్రమాలు, దాడులు ఏవైనా ఉంటే అందుకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో ప్రూప్స్ బయటికి తీస్తున్నారు. ఇలా పక్కగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే కాకాణి, పిన్నెళ్లి సోదరులకు ఉచ్చు బిగిసినట్లే అంటున్నారు.
మరో నాలుగైదు రోజుల్లోనే ఇద్దరు కీలక నేతల అరెస్ట్?
ఈ నేపథ్యంలో రెడ్‌బుక్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్ అంటుంటే..ఎర్ర రంగును చూస్తే భయపడిపోతున్నారని లోకేశ్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి జూన్ నెల టెన్షన్ పట్టుకుందట. అసలే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఓవైపు సిట్..ఇంకోవైపు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. కీలక నిందితులను విచారించి..అసలు సూత్రధారి ఎవరో తేల్చే పనిలో పడ్డాయి దర్యాప్తు సంస్థలు. ఇలాంటి సిచ్యువేషన్‌లో మరో నాలుగైదు రోజుల్లోనే ఇద్దరు కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది కూడా లిక్కర్ స్కామ్‌లోనని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు ఏపీలో అందరూ అనుకున్నట్లు, ఊహించినట్లు అరెస్టులు జరగడం లేదు. కొడాలి నాని అరెస్టుపై చాలా రోజులుగా లీక్స్ వస్తున్నాయ్. కానీ ఆయన అరెస్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. దాంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలను అరెస్ట్ చేస్తారా లేక ఏదైనా కొత్త కేసు తెరమీదకు వచ్చే అవకాశం ఉందా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
Also Read: కవిత లెటర్‌తో బీఆర్ఎస్‌లో దుమారం.. అయినా కేసీఆర్ మౌనం.. సార్ సైలెన్స్ వ్యూహాత్మకమా?
కొడాలి నాని, పిన్నెళ్లి బ్రదర్స్ అరెస్ట్?
నెక్స్ట్ అరెస్టులు లిక్కర్ స్కామ్ కేసులోనే ఉంటే అది ఏపీ పాలిటిక్స్‌లో మరో సెన్సేషనల్ కేసు కానుంది. ఎందుకంటే వైసీపీ అధినేత టార్గెట్‌గానే లిక్కర్ ఫైల్స్ కథేంటో తేల్చే పనిలో ఉన్నాయట దర్యాప్తు సంస్థలు. అదే జరిగితే వైసీపీ అధినేతకు సన్నిహితంగా ఉన్న ఓ మాజీ మంత్రితో పాటు, ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అదీ కాకపోతే కొడాలినాని, పిన్నెళ్లి బ్రదర్స్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది చూడాలి మరి.