Bhumana Karunakar Reddy: ఆమె అవినీతిలో అనకొండ, తాటకి, ఆధునిక రజియా సుల్తాన్..! ఐఏఎస్ అధికారిణిపై భూమన సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నాయకులకు నా గురించి లేనిపోని మాటలు చెప్పి నా పైకి ఉసిగొలుపుతోందని సీరియస్ అయ్యారు.

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేరు వెల్లడించకుండా శ్రీలక్ష్మిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిలో ఆమె అనకొండ లాంటి వారు అంటూ విరుచుకుపడ్డారు.

ఆమెకు డబ్బు సంపాదన తప్ప నైతిక విలువలు లేవని విమర్శించారు.

కనీసం లక్షన్నర రూపాయలకు పైబడిన ఖరీదైన చీరలే ఆమె ధరిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు సుమారు 50 లక్షల రూపాయలు ఖరీదైన 11 విగ్గులు ఉన్నాయని భూమన అన్నారు.

ఆమె ఆధునిక రజియా సుల్తాన్ అని అభివర్ణించారు.

”మంత్రులను పూచిక పుల్లల్లా చూస్తారు. తన శాఖకు చెందిన మంత్రిని కనీసం లెక్క కూడా పెట్టరు. ఆమె తాటకి లాగా కిందిస్థాయి అధికారులను చూస్తారు.

మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి నగరంలో అదనపు రోడ్లు వేస్తున్న సమయంలో ఆమె ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు ఆశించారు.

నాడు మేము దీనిని అడ్డుకున్న కారణంగానే మాపై ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు” అని భూమన అన్నారు.

2వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆమె మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల విషయంలో మేము ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు.

ఆ అవినీతి అధికారిణికి అత్యున్నత న్యాయస్థానం కూడా చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. ఆమె అవినీతిని అడ్డుకున్నానని నాపై పగబట్టిందని భూమన అన్నారు.

టీడీపీ నాయకులకు నా గురించి లేనిపోని మాటలు చెప్పి నా పైకి ఉసిగొలుపుతోందని సీరియస్ అయ్యారు.

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మీడియాకు వీడియో విడుదల చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

Also Read: లేడీ డాన్‌ ఫోన్‌లో ఏముంది? ఆ లీడర్ల గుండెల్లో దడ..! ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయ్?