నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని.. జనసేనలోకి.. బాలశౌరిపై పేర్ని నాని హాట్ కామెంట్స్

బందరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సింబల్ మీద ఎందుకు పోటీ చేశావ్? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడని తెలిస్తే ఎందుకు వచ్చావ్? సిగ్గుండాలి కదా.. అన్ని తెలిసి రావడానికి.

Perni Nani fires on machilipatnam MP vallabhaneni balashowry

Perni Nani on Vallabhaneni Balashowry: వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవుల కోసం పోయి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని బాలశౌరిపై ధ్వజమెత్తారు. జగన్ గురించి అంతా తెలుసునని చెబుతున్న బాలశౌరి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎందుకు పోటీచేశారని ప్రశ్నించారు. పార్టీ మారడం తప్పులేదని, కానీ పదవులు ఇచ్చిన వారిని కించపరిచేలా మాట్లడడం సబబు కాదన్నారు. తెనాలి, నరసరావుపేట, గుంటూరులో ఎంక్వయిరి చేస్తే బాలశౌరి గురించి మొత్తం తెలుస్తుందని చెప్పారు.

”నాకు అన్నీ తెలుసని బాలశౌరి చెబుతున్నారు.. అన్ని తెలిసి జగన్ దగ్గరకు ఎందుకు వచ్చావ్? 2014లో జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావ్? 2019లో బందరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సింబల్ మీద ఎందుకు పోటీ చేశావ్? జగన్మోహన్ రెడ్డి చెడ్డోడని తెలిస్తే ఎందుకు వచ్చావ్? సిగ్గుండాలి కదా.. అన్ని తెలిసి రావడానికి. పారిపోవడానికి సిద్ధమా అని అగుతున్నారు. పారి పోయేబతుకులు ఎవరివి? తెనాలి నుంచి 2004లో నరసరావుపేట పారిపోయింది ఎవరు? 2009లో నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయింది ఎవరు? 2019 వచ్చే పాటికి గుంటూరులో కాకుండా బందరు పారిపోయింది ఎవరు? నాడు రాజశేఖరెడ్డి గారు లేకపోతే బాలశౌరికి బతుకు లేదు. చనిపోయిన వైఎస్సార్ గురించి, కేవీపీ రామచంద్రరావు, జగన్ గురించి జుగుప్పాకరంగా మాట్లాడడం ఎవరికీ తెలియదనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా?

Also Read: పవన్ కళ్యాణ్ కలియుగ శల్యుడు.. కార్యకర్తలకు భోజనం పెడితే సర్వర్లమా?

చంద్రబాబు తన పార్టీలో చేర్చుకోవడానికి తిరస్కరిస్తే జనసేన పార్టీలో చేరావ్. ఒక ప్రొడ్యూసర్ తో కబురు చేస్తే పవన్ కళ్యాణ్ ఛీకొట్టిన మాట వాస్తమా, కాదా? తర్వాత చిరంజీవి కాళ్లు పట్టుకుని ఆయనతో ఫోన్ చేయించి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన మాట వాస్తమా, కాదా? 2004 నుంచి 2009 వరకు నాదండ్ల మనోహర్ ను ఎంత కాల్చుకుతిన్నావ్? ఆయనను ఎంత ఏడిపించి రచ్చరచ్చ చేశావ్. నాదండ్ల మనోహర్ సతీమణిని దుర్భాషలాడావు. నువ్వు నాదండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుంటేనే కదా ఆయన కరిగి.. నిన్ను పార్టీలోకి రానిచ్చింది. చిరంజీవి ఫోన్ చేసి చెబితేనే కదా నాదండ్ల మనోహర్.. నిన్ను క్షమించారు. ఇన్ని సర్కస్ లు, పిల్లిమొగ్గలు వేసి చివరకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్. రాజకీయాల కోసం పార్టీలు మారడం తప్పులేదు కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కించపరిచే మాటలు మాట్లాడం మంచిది కాద”ని బాలశౌరికి పేర్నినాని హితవు పలికారు.