పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలపై పేర్ని నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు.

YSRCP Leader Perni Nani takes on Pawan Kalyan and YS Sharmila
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. బంధాలు, బంధుత్వాల గురించి మీరా చెప్పేది అంటూ ప్రశ్నించారు. కుటుంబ బంధాల గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్న శత్రువులతో కలిసి దూషిస్తున్న వ్యక్తి షర్మిల అంటూ విమర్శించారు. తన కుటుంబ సభ్యులను తిట్టించిన చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా పరిశ్రమ కోసం జగన్ దగ్గరకి చిరంజీవి వస్తే.. ఆయనను జనసైనికులు తిట్టారని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా చిరంజీవి వుంటే.. కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కలియుగ శల్యుడు
”రేపు జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ సైన్యం టీడీపీ, జనసేన మా మీద విరుచుకుపడుతున్నారు. పవన్ జంపింగ్ జపాన్. పవన్ సీఎం అవ్వలేనని జనసైనికులకి చెబుతున్నారు. యుద్దంలో దైర్యాన్ని చంపేవాడు శల్యుడు అంటారు. పల్లకి మోయాలనే చెప్పుతున్నారంటే పవన్ శల్యుడే కదా. అన్నని అవమానించి రాజకీయాలు చేసిన వ్యక్తి పవన్. చిరంజీవిని మీ ఫ్యాన్స్ తిడితే ఏంచేశారు? ఇది కలిగియుగ భారతం. చంద్రబాబు, లోకేష్, పవన్, సోనియా గాంధీ కలియుగ కౌరవుల్లా మా మీద యుద్ధానికి వస్తున్నారు. జగన్ ది అర్జున్ పాత్రే. జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లో వున్నప్పుడు కూడా కాంగ్రెస్ తిట్టలేదా, వ్యక్తిగత విమర్శలు చేయలేదా? చంద్రబాబు నా గురించి సర్వర్ అని మాట్లాడారు. చంద్రబాబుకు మతిభ్రమించింది. పార్టీ కార్యక్రమం కోసం వెళుతూ మా కార్యకర్తలకు నేను భోజనం పెడితే సర్వర్లమా? ఎంత పెత్తందారి మనస్తత్వం? చంద్రబాబుకు సర్వర్లు అంటే అంత చిన్నచూపా? ఐటీ అయినా, సర్వర్ అయినా ఉద్యోగం కదా” అని పేర్ని నాని ప్రశ్నించారు.
Also Read: సీఎం జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా, ఇవ్వరా? ఆందోళనలో మంత్రి బొత్స మేనల్లుడు