హరిహర వీర మల్లు సినిమా అందుకే పూర్తి చేయడం లేదా?: పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.

Pothina Mahesh: ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలు వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన డబ్బుతో పార్టీ నడుపుతున్నానని చెబుతున్న పవన్.. జనసేనకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సహాయం చేస్తామని వసూలు చేసిన విరాళాల్లో ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు పోతిన మహేష్ పలు ప్రశ్నలు సంధించారు.

ఏ ఎజెండాతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారు?
చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ లక్ష్యమా?
కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్ భావిస్తున్నారా?
మంగళగిరిలో పార్టీ కార్యాలయం కొనుగోలుకు ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి?
ఎలక్ట్రోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టింది?

కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంత?
అందులో రైతులకు ఇచ్చినది ఎంత.. పవన్ కల్యాణ్ వెనకేసుకొన్నది ఎంత?
టీటీడీకి ఒక్కరూపాయి కూడా పవన్ విరాళం ఎందుకివ్వరు?
కాజా దగ్గర ఉన్న దశావతారం ఆలయానికే విరాళాలు ఎందుకిస్తారు ?
నాదేండ్ల మనోహర్ కి స్పోర్ట్స్ కారు కొనేందుకు 10 కోట్లు ఎవరిచ్చారు?

హరిహర వీర మల్లు సినిమా ఎందుకు పూర్తి చేయడం లేదు?
నల్లధనాన్ని వైట్‌గా మార్చేందుకే ఈ సినిమా తీస్తున్నారా?
పవన్ కల్యాణ్‌పై దిల్ రాజు ఐటీకి పిర్యాదు చేసింది నిజం కాదా?
మీ ఇధ్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి?
సినిమా ఇండస్ట్రీలో ఎంత మందిని పవన్ ప్రోత్సహించారు?
అల్లు అర్జున్ గురించి ఒక్క మంచి మాటైనా చెప్పారా?

Also Read: బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి: వెల్లంపల్లి శ్రీనివాస్

ట్రెండింగ్ వార్తలు