మేము సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర.. ఎన్నికల వరకు జనంలోనే జగన్: తలశిల రఘురామ్

మొత్తం బస్సు యాత్ర 21 రోజుల వరకు కొనసాగనుండగా.. 21 బహిరంగ సభలను నిర్వహించనున్నారు. పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని రఘురామ్ స్పష్టం చేశారు.

YS Jagan Siddham: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ ప్రకటించగా.. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేశారు.

Read Also : BJP Vijaya Sankalpa Sabha : తెలంగాణను దోచుకున్నవారిని వదిలేది లేదు.. ఇది మోదీ గ్యారెంటీ!

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం పేరుతో ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత తలశిల రఘురామ్ మాట్లాడుతూ.. మేము సిద్దం పేరుతో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఎన్నికల వరకు జగన్ జనంలోనే ఉండాలని నిర్ణయించారని ఆయన చెప్పారు.

21 రోజులు బస్సు యాత్ర.. 21 బహిరంగ సభలు :
ప్రతి పార్లమెంట్‌లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసినట్టు తలశిల తెలిపారు. బస్సు యాత్రతో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేం సిద్ధం బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు.

మొత్తం బస్సు యాత్ర 21 రోజుల వరకు కొనసాగనుండగా.. 21 బహిరంగ సభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని రఘురామ్ స్పష్టం చేశారు. అయితే, పూర్తి రూట్ మ్యాప్ రేపు (మంగళవారం) ప్రకటిస్తామన్నారు. అందులో మొదటి నాలుగు రోజుల షెడ్యుల్ ఉంటుందని తలశిల రఘురామ్ తెలిపారు.

Read Also : దానం నాగేందర్ కచ్చితంగా డిస్‌క్వాలిఫై అవుతారు: కౌశిక్‌రెడ్డి

ట్రెండింగ్ వార్తలు