దానం నాగేందర్ కచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు: కౌశిక్‌రెడ్డి
మూడు నెలల లోపల దానం నాగేందర్ డిస్క్వాలిఫై కాబోతున్నాడు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన అతడిపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుంది.
Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మూడు నెలల్లో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడం ఖాయమని పేర్కొన్నారు. దానంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
”మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు దానం నాగేందర్‌పై తీసుకోవాలి. స్పీకర్ సైతం కచ్చితంగా పరిశీలిస్తాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. మరి ఈరోజు రాళ్ల తోటి కొట్టి చంపుతారా నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? దానం నాగేందర్ పంజాగుట్ట బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడని విమర్శలు చేసిన మీరు ఎందుకు తీసుకున్నారు?
బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన అతడు కచ్చితంగా డిస్క్వాలిఫై కాబోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మూడు నెలల లోపల దానం నాగేందర్ డిస్క్వాలిఫై కాబోతున్నాడు. రేవంత్ రెడ్డి దానం నాగేందర్ చేరిక సందర్భంగా బాగా నవ్వుతున్నారు. మీరు కొట్టారు మేము తీసుకున్నాము. మేము కొట్టినప్పుడు మీకు చావు దెబ్బే. మేం గేట్లు తెరిస్తే మొత్తం వస్తారు అంటున్నారు. మేమింకా గేట్లు తెరవలేదు.. మేము గేట్లు తెరిస్తే మొత్తం భూస్థాపితం అవుతార”ని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్రను లిఖించబోతున్నారు.. ప్రధాని మోదీ కామెంట్స్..