Kaivalya Reddy Meets Lokesh : నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ.. అక్కడి నుంచి బరిలోకి..!

మాజీమంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కూతురు కైవల్యా రెడ్డి లోకేశ్‌ని కలిశారు. ఆత్మకూరు టీడీపీ టికెట్ తనకివ్వాలని లోకేశ్ ను కోరినట్లు తెలుస్తోంది.(Kaivalya Reddy Meets Lokesh)

Kaivalya Reddy Meets Lokesh

Kaivalya Reddy Meets Lokesh : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీమంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూతురు కైవల్యా రెడ్డి శనివారం ఒంగోలులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని కలిశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ టికెట్ తనకివ్వాలని కైవల్యా రెడ్డి లోకేశ్ ను కోరినట్లు తెలుస్తోంది. కైవల్యా రెడ్డి బద్వేల్ టీడీపీ మహిళా నేత విజయమ్మకు కోడలు.

లోకేశ్‌ను కలిసిన కైవల్యా రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని లోకేశ్ దగ్గర ప్రస్తావించారట.(Kaivalya Reddy Meets Lokesh)

బద్వేల్‌ తెలుగుదేశం మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు కావడంతో పుట్టింటితో పాటు మెట్టినింట రాజకీయ పలుకుబడి కూడా ఆమెకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జూన్‌ 23న ఉప ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

రెండు రోజుల్లో మీడియాకు సాక్ష్యాలు ఇస్తా, వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న కైవల్య.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Kaivalya Reddy

వైసీపీ ఎమ్మెల్యే కూతురు కైవల్యారెడ్డి లోకేశ్ తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. కైవల్యారెడ్డి తన భర్త రితేష్‌తో కలిసి నారా లోకేష్‌ను కలిశారు. ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని.. ఈ క్రమంలోనే లోకే‌ష్‌ను కలిశారని సమాచారం. టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఆమె చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని లోకేష్ దగ్గర ప్రస్తావించినట్టుగా సమాచారం.

లోకేష్‌తో కైవల్యారెడ్డి భేటీపై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ‘‘లోకేష్‌ను కైవల్య కలిసిందా.. అయితే ఎందుకు కలిసిందో ఆమెనే అడగండి. ప్రస్తుతం కైవల్య బద్వేల్ లోని బిజివేముల కుటుంబ సభ్యురాలు’’ అని ఆయన చెప్పారు.

కైవల్యా రెడ్డి అత్తారిల్లు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉంది. బద్వేలు టీడీపీ మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి అనుచరులు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఆత్మకూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలవాలని భావిస్తున్నట్టుగా సమాచారం.

Atmakur YSRCP Candidate : ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి అతడేనా?

రాజకీయంగా రెండు దిగ్గజ కుటుంబాల ఆడపడుచు అయిన కైవల్యా రెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో టీడీపీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి 2009లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రిగా చక్రం తిప్పారు. అలాగే, గతంలోనూ ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానంలో ఆనం ఫ్యామిలీ గెలుపొందిన చరిత్ర ఉంది.(Kaivalya Reddy Meets Lokesh)

నెల్లూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నప్పటికీ.. జగన్ నాయకత్వంలోని అధికార వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదనే భావన ఆనం రాంనారాయణరెడ్డిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులపైనే వీలు చిక్కినప్పుడల్లా బహిరంగంగా అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నారా లోకేష్‌తో కైవల్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు