రెండు రోజుల్లో మీడియాకు సాక్ష్యాలు ఇస్తా, వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల

  • Edited By: naveen , June 4, 2020 / 11:05 AM IST
రెండు రోజుల్లో మీడియాకు సాక్ష్యాలు ఇస్తా, వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల

మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగోలేదన్నారు. జిల్లాలో నీటి లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఎస్ఎస్ కెనాల్ ను పరిశీలించాలని స్వయంగా సీఎం జగన్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వెంకటగిరి ఉందో లేదో చెప్పాలన్నారు. దీనికి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరు సమాధానం చెబుతారని అడిగారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. వెంటకగిరి నియోజకవర్గాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆనం ఆరోపించారు. నిన్న నీటి విషయం మాట్లాడితే రాత్రికి రాత్రి లెక్కలు మార్చారని అన్నారు. సీఎం జగన్ ఆదేశించినా మాకు పథకాలు రానివ్వడం లేదన్నారు. తమపై జరుగుతున్న నిర్లక్ష్యం గురించి రెండు రోజుల్లో మీడియాకు సాక్ష్యాలు ఇస్తానని ఆనం చెప్పారు. 

ఏడాదిగా వెంకటగిరిలో అభివృద్ధి లేదు:
ఏడాది నుండి వెంకటగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అభివృద్ధి కోసం మంత్రులకు ఇచ్చిన డీపీఆర్ లు ఎక్కడున్నాయో కూడా తెలియదని ఆనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని జిల్లా అధికారులు మర్చిపోయారేమోనని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఏడాది పాలనలో కేకు సంబరాలే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదని నిన్న ఆనం చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఇప్పుడు అధికారులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఆనం మనసులో ఏముంది?
నిన్న మంత్రులు, నేడు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ ఆనం చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాలతో పాటు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ, ప్రభుత్వంపైనే ఆనం ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఆయన మనసులో ఏముంది? అని చర్చించుకుంటున్నారు. కాగా, మీడియాకు సాక్ష్యాలు ఇస్తానని చెప్పడంతో ఆ సాక్ష్యాలు ఏమై ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఆనం తీరతో అధికార పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు.

Read: 5 రోజుల్లో రేషన్ కార్డు : ఫ్రీగా బియ్యం సంచులు..6వ తేదీ నుంచి కార్డుల జారీ