Nandigam Suresh : జగన్‌పై సింగిల్‌గా పోటీ చేసే ధైర్యముందా? చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వైసీపీ ఎంపీ సవాల్

తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ల అవసరం ఈ రాష్ట్రానికి లేదన్నారాయన.

MP Nandigam Suresh Babu Challenge (Photo : Google)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. సీఎం జగన్ పై సింగిల్ గా పోటీ చేసే ధైర్యముందా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను అవమానించారు అని ఎంపీ సురేశ్ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ కి సంపూర్ణ మద్దతిస్తున్నారు అని చెప్పారు. జగన్ పాలనతో ఏపీలో పేదరికం తగ్గిందన్నారు. ఆకలి తీర్చే నాయకుడు కావాలో – మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

చంద్రబాబుకు ఏదో ఒకరోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి అని ఎంపీ సురేశ్ అన్నారు. ఈ రాష్ట్రానికి లోకేశ్ అవసరం ఏముంది? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీకి అద్దెకు ఇచ్చారని విమర్శించారు. పవన్ కల్యాణ్ తనకు అవసరమైనప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పెడుతుంటారు అని అన్నారు.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ల అవసరం ఈ రాష్ట్రానికి లేదన్నారాయన. జగన్.. ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు అని ఎంపీ సురేశ్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను కాల్చి చంపింది చంద్రబాబు కాదా అని ఆయన నిలదీశారు.