Prashant Kishor : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది.

Prashant Kishor : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

Prashant Kishor In Touch With TDP

Updated On : December 12, 2023 / 6:14 PM IST

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓపక్క వైసీపీ ఇంఛార్జిల మార్పుతో కలకలం చెలరేగగా.. మరో సంచలన విషయం వెలుగుచూసింది. గతంలో వైసీపీ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. టీడీపీకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ పరిణామాల అనంతరం.. పీకే.. టీడీపీకి టచ్ లోకి వచ్చినట్లు ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం న్యాయపరమైన అంశాలు చర్చించడానికి లోకేశ్ చాలాకాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ఆయనతో ప్రశాంత్ కిశోర్ తో టచ్ లోకి వెళ్లారని, అప్పటి నుంచి టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇవన్నీ కన్సల్టెన్సీ తరహాలో కాకుండా ఆయన స్వచ్చందంగా చేస్తుండటం విశేషం.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

టీడీపీకి మొదటి నుంచి రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కన్సల్టెన్సీ ఉంది. రాబిన్ శర్మ పనితీరుపై చంద్రబాబు చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే, స్వచ్చందంగా సహకరిస్తానని ప్రశాంత్ కిశోర్ ముందుకు రావడంతో చంద్రబాబు కాదనలేకపోయినట్లుగా తెలుస్తోంది.

రోజువారీ అంశాలు కాకుండా కీలకమైన విషయాల్లో పీకే టీడీపీకి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. రాబిన్ శర్మకు, ప్రశాంత్ కిశోర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. పీకే దగ్గర రాబిన్ శర్మ చాలాకాలం పని చేశారు. గతంలో వైసీపీ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. తమకెందుకు సహకరిస్తున్నారు అనే అనుమానం టీడీపీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది. బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ఇక పూర్తి స్థాయిలో టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేయడానికి సమయం లేదంటున్నారు.

Also Read : వైసీపీకి సింగిల్ డిజిట్ అని ఐ ప్యాక్ సర్వే తేల్చేసింది.. అందుకే జగన్ చేతులెత్తేశారు : బోండా ఉమ

మరోవైపు పీకే తమకు టచ్ లో ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకుండా టీడీపీ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోని అతి కొద్దిమంది ముఖ్యులకు మాత్రమే చంద్రబాబు, పీకే టచ్ లో ఉన్న విషయం తెలుసునని సమాచారం.