Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. విపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని హితవు పలికారు.(Kotamreddy Sridhar Reddy)

Kotamreddy Sridhar Reddy : ఏపీలో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు సై అంటే సై అంటున్నారు. వీరి మధ్య వ్యవహారం మాటలకే పరిమితం కాలేదు. అంతకుమించి నడుస్తోంది. అక్రమ కట్టడాలు అంటూ టీడీపీ నేతల ఇళ్లను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనని ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు.

పాలక వర్గానికి చెందిన నాయకులు ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని, శత్రువుల్లా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ శ్రేణులను షాక్ కి గురి చేశాయి. సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని హితవు పలికారు. అధికార మదంతో ముందుకెళ్తే పెట్టాల్సిన చోట జనం వాత పెడతారని కోటంరెడ్డి హెచ్చరించారు.

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

శనివారం అన్నమయ్య సర్కిల్‌లో నిర్వహించిన నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అధికారం తలకెక్కితే ప్రజలు పెట్టాల్సిన చోట వాతలు పెడతారని హెచ్చరించారు.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎట్టి పరిస్థితుల్లో వేధింపులకు పాల్పడొద్దని, ఇబ్బందులు పెట్టొద్దని సొంత పార్టీ నాయకులకు ఆయన సూచించారు. ‘‘ఎక్కడా కూడా వారిని శత్రువులుగా చూడొద్దు. రాజకీయాల్లో పోటీదారులుగా మాత్రమే చూడండి. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ప్రజలకు జవాబుదారిగా ఉందాం. అందరినీ ప్రేమిద్దాం. ప్రత్యర్థి పార్టీలను పోటీ దారులుగా చూద్దాం. శత్రువులుగా వద్దు. అధికారం తలకెక్కితే.. అధికార మదంతో ప్రవర్తిస్తే.. ప్రజలు సమయం వచ్చినప్పుడు పెట్టాల్సిన చోట వాతలు పెడతారు’’ అని పార్టీ శ్రేణులకు హెచ్చరించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్

”అధికార పార్టీ నాయకులుగా ప్రజలతో ఎక్కువగా సఖ్యతతో ఉండండి. తగ్గి ఉండండి. మనం ఎంత తగ్గితే అంత మేలు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు, వేధింపులకు పాల్పడొద్దు. జిల్లాలో పది స్థానాల్లోనూ వైసీపీ గెలవాలి. నేను కడుపులో ఒకటి ఉంచుకొని బయటకు మరొకటి మాట్లాడను. నేను మళ్లీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాను” అని కోటంరెడ్డి అన్నారు.

విపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అంటూ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరుల సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సొంత పార్టీ నేతలకు హితవు పలకడం గమనార్హం. కోటంరెడ్డి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీలోనే చర్చకు దారితీశాయి.

ట్రెండింగ్ వార్తలు