YSRCP Incharges List : వైసీపీ 12వ జాబితా విడుదల.. గాజువాక ఇన్‌ఛార్జ్‌గా గుడివాడ అమర్నాథ్
YSRCP 12th List : అమర్‌నాథ్ పోటీపై సందిగ్ధత తొలగింది. గాజువాక సమన్వయ కర్తగా గుడివాడ అమర్‌నాథ్‌ను వైసీపీ అధిష్టానం.

YSRCP Releases 12th List of YCP Inchages List
YSRCP Incharges List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా 12వ జాబితాను విడుదల చేసింది.
ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్ జగన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి గుడివాడ అమర్మాథ్, చిలుకూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కావాటి మనోహర్ నాయుడుని నియమించింది.
గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ. ఈమె ప్రస్తుతం కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. శాసనమండలి విప్‌గా ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని నియామించింది. జంగా కృష్ణమూర్తి స్థానంలో వరుదు కల్యాణి నియామించింది వైసీపీ అధిష్టానం.

YSRCP Releases 12th List
అమర్‌నాథ్ పోటీపై తొలగిన సందిగ్ధత :
అమర్‌నాథ్ పోటీపై సందిగ్ధత తొలగింది. గాజువాక సమన్వయ కర్తగా గుడివాడ అమర్‌నాథ్‌ను వైసీపీ అధిష్టానం. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరుకూటి చందుని అధిష్టానం నియమించింది. చందుని మార్చలని అదిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి పెంచారు. టీడీపీ, జనసేన పొత్తు తర్వాత వైసీపీ అభ్యర్థిత్వన్ని అధిష్టానం ఖరారు చేసింది.