Mahashivratri 2025
Maha Shivratri 2025 : హిందూ పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన హిందువులు ఎంతో భక్తితో శివున్ని పూజిస్తుంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి వస్తుంది.
ప్రతి శివ భక్తుడు ఈ పండుగ రోజున ప్రత్యేక శ్రద్ధలతో స్వామివారిని అనేక ఫలాలతో ఆరాధిస్తుంటారు. ప్రత్యేకించి భక్తులు శివలింగానికి జలాభిషేకం చేస్తారు. శివ మంత్రాలను జపిస్తారు. ఆచారాల ప్రకారం.. శివభక్తులు భక్తితో పూజిస్తే కోరికలన్నింటినీ తీరుస్తాడని విశ్వసిస్తారు.
Read Also : Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పువ్వుతో శివలింగాన్ని పూజించకూడదు.. ఎందుకంటే?
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మహాశివరాత్రి రోజున ఎలాంటి నియమాలను పాటించాలి? ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మహాశివరాత్రి పండగను సాధారణంగా రాత్రి సమయంలోనే జరుపుకుంటారు. శివాలయాల్లో భక్తులంతా చేరి ఆ స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. శివరాత్రికి అనేక మంది భక్తులు చాలా నియమాలను ఆచరిస్తారు. అందులో ప్రధానంగా రాత్రంతా శివ సన్నిధిలో జాగారం చేస్తుంటారు.
అంటే.. నిద్రపోకుండా ఆ రాత్రంతా శివ భక్తి ఆరాధనలోనే గడిపేస్తారు. ఆ రోజు మొత్తం నిద్ర ఆహారాలకు దూరంగా ఉంటారు. కేవలం జాగారం చేస్తూ ఆ స్వామి పేరును జపం చేస్తుంటారు.
మహాశివరాత్రి రోజున నియమాల్లో మొదటిది.. ఎక్కువగా మాట్లాడకూడదు. కేవలం చెడు ఆలోచనలు దరిచేరకూడదు. చెడు విషయాలను గుర్తు చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదని ఏడు పనుల గురించి ఇప్పుడు చూద్దాం..
నిద్రపోవద్దు :
మహాశివరాత్రి రోజున ఆ రాత్రంతా నిద్రపోకూడదు. కేవలం స్వామి వారి సేవలో జాగారం చేస్తుండాలి. శివరాత్రి అంటేనే మేల్కోని ఉండాలని అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ రోజు ఎంత పూజలు చేసినా పుణ్యఫలం దక్కదని విశ్వాసం.
మాంసాహారం తినొద్దు :
శివరాత్రి రోజున నిద్ర మాత్రమే కాదు.. ఆహారం కూడా తినకూడదు. సాత్విక ఆహారమే తీసుకోవాలి. అది కూడా అల్పాహారమే ఉండాలి. తేలికగా జీర్ణమయ్యేది ఉండాలి. అతిగా భోజనం చేయడం లాంటివి చేయకూడదు. మాంసాహరం అసలు ముట్టరాదు. పండ్లు, పాలు లేదా ఏదైనా డ్రై ప్రూట్స్ వంటివి తీసుకోవాలి.
మీ మనస్సు శాంతంగా ఉంచుకోవాలి :
శివరాత్రి సమయంలో జాగరం చేసేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరమైన విషయాల పట్ల మాట్లాడకూడదు. ఎవరిని దూషించకూడదు. తక్కువగా తినాలి. అందరి పట్ల ప్రేమగా మెలగాలి. శివ ధ్యానం చేస్తూ ఉండాలి.
మద్యం సేవించరాదు :
శివరాత్రి రోజున మద్యం ముట్టరాదు. మత్తు కలిగించే పానియాలు తాగకూడదు. కేవలం స్వామి వారి ప్రసాదాలు, తీర్థాలను మాత్రమే తీసుకుంటుండాలి. ఎలాంటి మత్తుపరమైన ఆహారాలను దరిచేరనీయరాదు.
ఉపవాసం విస్మరించరాదు :
శివరాత్రి సమయంలో భక్తులు తప్పనిసరిగా ఉపవాస దీక్షను పాటించాలి. ఆ రోజుంతా ఉపవాసం ఉంటూ శివ సన్నిధిలో సేద తీరాలి. ఉపవాసం చేయడం వెనక పరమార్థాన్ని గుర్తించాలి. ఉపవాసంతో మీ శరీరంలో పేరుకుపోయినా విష పదార్థాలను డిటాక్స్ చేస్తుంది. ఆరోగ్యపరంగా చాలా మంచిది కూడా. మీ మనస్సును కేవలం భక్తి మార్గంలోనే ఉండేలా ప్రయత్నించాలి.
అంకితభావంతో మెలగాలి :
శివరాత్రి అంటే.. సౌకర్యవంతంగా ఉండాలని భావించకూడదు. ఆ రోజుంతా స్వామి ఆరాధనలోనే ఉండాలి. అంకితభావంతో మెలగాలి. ఎంటర్ టైన్మెంట్ అంటూ ఫోన్లు, టీవీలతో గడపేయకూడదు. ధ్యానం, జపాలు, మంత్రోచ్చరణలు చేస్తూ ఉండాలి.
Read Also : Maha Shivratri 2025 : మహాశివరాత్రి రోజున ఉపవాసం నియమాలేంటి? ఎలా చేయాలి? ఏమి తినాలి? ఏమి తినకూడదంటే?
పండుగను విస్మరించరాదు :
మహా శివరాత్రి రోజున ప్రత్యేకంగా జీవించాలి. ఏడాదిలో ఒకరోజున ఆధ్యాత్మక జీవనాన్ని కొనసాగించాలి. శివరాత్రి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజున పొరపాటున కూడా వినోదాల కోసం కేటాయించరాదు. కేవలం శివుని ధ్యానంలో మునిగిపోవాలి. అప్పుడే ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుందని భావించాలి.