These 9 Things Should Remember Before Wearing Rudraksha
Astrology Tips : మన హిందూ పురణాల్లో రుద్రాక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షను శివునిరూపంగా భావిస్తారు. రుద్రాక్షలను అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. ఈ రుద్రాక్షల్లో దైవ శక్తి ఇమిడి ఉంటుందని బలంగా విశ్వసిస్తారు. రుద్రాక్ష అనేది శివుడి కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించిందని నమ్ముతారు.
ఎంతో పవిత్రంగా భావించే రుద్రాక్షను ధరించడం ద్వారా శివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. రుద్రాక్ష దారుణ చేయడం ద్వారా ప్రతికూల శక్తులు దరిచేరవని నమ్మకం. అలాంటి ఎంతో పవిత్రమైన రుద్రాక్షను ఎప్పుడు పడితే అప్పుడు ధరించవచ్చా?
అసలు ఏయే సమయాల్లో ధరించకూడదో తెలుసా? ఒకవేళ రుద్రాక్షను ధరించే ముందు ఈ 9 విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. రుద్రాక్ష దారణకు ముందు ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రుద్రాక్ష ధరించే ముందు శుద్ధి చేయండి :
రుద్రాక్ష పూసలను నీరు లేదా పాలతో శుభ్రవం చేయాలి. రుద్రాక్ష దారుణకు ముందు వాటిని శక్తివంతం చేస్తుంది. అందులో దైవశక్తిని పెంచుతుందని విశ్వాసం.
శుభప్రదమైన రోజున ధరించండి :
రుద్రాక్షను శుభప్రదమైన రోజున మాత్రమే ధరించాలి. ప్రధానంగా సోమవారం లేదా ఏదైనా పవిత్ర పండుగ సమయంలో రుద్రాక్ష దారుణ చేయడం చాలా మంచిది.
మంత్రాలు జపించండి :
రుద్రాక్షను ధరించే సమయంలో దానిలో దైవశక్తిని పెంచేందుకు ‘ఓం నమ: శివాయ’ అనే మంత్రం లేదా ఇతర సంబంధిత ప్రార్థనలను జపించండి.
రుద్రాక్షను శుభ్రంగా ఉంచండి :
రుద్రాక్షను క్రమం తప్పకుండా నీరు, మృదువైన బ్రష్ సాయంతో క్లీన్ చేయండి. రుద్రాక్ష నాణ్యతను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో ఏదైనా నూనె రాస్తుండండి.
Read Also : Vastu Shastra : వాస్తుశాస్త్రం ప్రకారం.. ఈ 8 వస్తువులను ఎప్పుడూ ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వకూడదు..!
చర్మానికి దగ్గరగా ధరించండి :
రుద్రాక్ష మాలను చర్మానికి దగ్గరగా ధరించండి. ఎందుకంటే.. మీ చర్మంపై స్వర్శతో ధరించినవారిలో శక్తిని సమర్థవంతంగా వ్యాపింపచేస్తుందని నమ్ముతారు.
చేయకూడని పనులు :
రుద్రాక్ష ధరించడానికి ముందు మద్యం సేవించడం, మాంసాహారం తినడం లేదా హింసాత్మక విషయాల్లో పాల్గొనడం వంటి అపవిత్రమైనవి చేయకూడదు.
మీ రుద్రాక్షను ఇతరులకు ఇవ్వొద్దు :
మీరు ధరించిన రుద్రాక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను ధరించమని ఇవ్వ కూడదు. అంతేకాదు.. మీ రుద్రాక్షను ఎవరిని తాకనివ్వకూడదు.
దెబ్బతిన్న పూసలను ధరించవద్దు :
రుద్రాక్ష పూసలు ఏమైనా దెబ్బతింటే అసలు ధరించకూడదు. ఎందుకంటే.. అవి పనికిరానివిగా పరిగణించాలి.