జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక మాస బహుళ పాడ్యమి : రా 11:50, కృత్తిక : రా 7:28 శనివారం, ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు.
మేషం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం, ఆరోగ్యం కుదుట పడటం, వృత్తి, వ్యాపారములలో ఉద్యోగములలో అనుకూలంగా ఉండటం, ఆధిపత్య దోరణి విడిచి పెట్టి అందరితో కలసి పనిచేస్తే విజయం లభిస్తుంది, అన్ని వ్యవహరములలో దూకుడు తగ్గించుకోవాలి, కొత్త నిర్ణయములు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది – సూర్య ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృషభం : ఈ రోజు మంచి ఫలితాలు కలుగుతాయి, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అధిక ఆదాయం కలగడం, ఈ రోజు వ్యాపారులకు శుభకరంగా ఉంది, మీ పోటీ దారులపై విజయం సాధిస్తారు, ఈ రోజు వ్యాపారంలో గణనీయమైన లాభములు కలుగుతాయి, కుటుంబ సభ్యులతో సంబంధ బాందవ్యాలు మెరుగు అవుతాయి, మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. : – అమ్మవారి ఆరాధన చేయటం వల్ల ఉత్తమమైన ఫలితములు పొందుతారు.
మిధునం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, వృత్తి పరంగా పురోగతి లోపిస్తుంది, ఆదాయం సామాన్యంగా ఉంటుంది, ఇతరులను మనసు నొప్పించే విధంగా మాట్లడటం మానుకుంటే మంచిది, జీవిత భాగస్వామితో అనుబంధం ధృడ పడుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది – హనుమన్ చాలిసా పారాయణము వలన మంచి ఫలితములు కలుగుతాయి.
కర్కాటకం : ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి, వృత్తి పరంగా నిర్ణయాలు తీసుకోనే విషయంలో గందర గోళంగా ఉంటాది, ఆర్థిక సమస్యలు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి, వివాదములు, గోడవలకు దూరంగా ఉండటం మంచిది, ఆర్ధికంగా నష్టపోయో ప్రమాదం ఉంది, వ్యాపారములో సమిష్ఠి నిర్ణయములతో ముందుకెళ్లడు మంచిది – నవగ్రహ శ్లోకములు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
సింహం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు, శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుండి ఉపసమనం లభిస్తుంది, కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది, వ్యాపారములలో ఆర్థిక లాభములు కలుగుతాయి, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి, కార్యసిద్ధి – శ్రీ హనుమ ఆరాధన వలన శుభం కలుగును.
కన్య : ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ,మీ లక్ష్య సాధన కోసం పనిచేస్తారు, సహచరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు ప్రణాలికలు వేస్తారు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమములలో పాల్గోంటారు, వ్యాపారములలో ఆటంకములు, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది – శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణము శుభకరం.
తులా: ఈ రోజు శుభ ఫలితములు కలుగుతాయి, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి, వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనములు పొందుతారు, ఖర్చులు పెరగడం, కీలక వ్యవహారములలో నిర్ణయములు తీసుకోవడంలో స్పష్టత లోపిస్తుంది, గిట్టని వారి మాటలు పట్టించుకోవద్దు, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి, విధ్యార్థులకు అనుకూలము – శ్రీ దత్తాత్రేయ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
వృశ్చికము: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, దూర ప్రయాణములు చేయడం, ఆర్థిక పరంగా లాభములు కలగడం, వ్యాపారములలో లాభములు, ఉద్యోగంలో అనుకూల ఫలితములు కలగడం, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరము, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం ఎదురు చూడాలి, కుటుంబంలో ఆనందము కలగడం, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు – శివారాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు – ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి, కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఎటూ చూసిన సమస్యలు చుట్టు ముట్టి ఉంటాయి, కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము, వృధా ఖర్చులు నివారిస్తే మంచిది, అనవసరపు విషయములలో కల్పించుకోకూడదు – శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం.
మకరం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, వృత్తి పరంగా చిన్నపాటి సమస్యలు మినహా ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, వాహన ప్రమాదముల విషయములో జాగ్రత్త అవసరము, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారములు కలిసివస్తాయి, అదృష్టం వరించి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది, సామాజికంగా అభివృద్ధిచెందుతారు – అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన వలన ఉత్తమమైన ఫలిత ములు కలుగుతాయి
కుంభం : ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి, అర్ధం లేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే ఆశించిన ప్రయోజనములు కలుగుతాయి, అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు, వృత్తి వ్యాపారములలో కీలక నిర్ణయములు తీసుకుంటారు, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి, తీర్థయాత్రలు, ప్రయాణములు చేస్తారు, వ్యాపారులకు ఋణ భారము నుండి విముక్తి లభిస్తుంది – శ్రీ కనకధార స్తోత్ర పారాయణము వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
మీనం : ఈ రోజు శుభకరంగా ఉంటుంది, వృత్తి పరంగా పొందిన విజయముల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది, ఆర్థిక పరంగా అధిక లాభములు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృడపడుతాయి, సంతోషం, శాంతి సంతృప్తితో ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది, ఈ రోజు లాభములు, పదోన్నతులు లభించడం జరుగుతుంది. – గణపతి ఆరాధన వలన శుభం జరుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956