Total Lunar Eclipse 2025: సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి రాజయోగమే..! 6 నెలలు తిరుగు లేదంతే..!
సంపూర్ణ చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజయోగం పట్టే రాశులు ఏవి.. వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి.. తెలుసుకుందాం..

Total Lunar Eclipse 2025: సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా అంటారు. భాద్రపద పౌర్ణమి రోజున రాత్రి వేళ గ్రహణం వస్తుంది. రాత్రి 9 గంటల 56 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. శతబిష, పూర్వాబాద్ర నక్షత్రాల్లో ఏర్పడనుంది. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజాము 1.26 గంటలకు ముగుస్తుంది. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. కాగా, ఈ సంపూర్ణ చంద్రగ్రహణంతో కొన్ని రాశుల జాతకులకు అఖండ రాజయోగం పట్టనుందట. ఆ 4 రాశుల జాతకులు ఎవరో తెలుసుకుందాం.
రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ఒక్కో రాశికి ఒక్కో ఫలితాన్ని కలిగింపజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పారు. మన జన్మ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం ఏర్పడితే.. అటువంటి గ్రహణం సమస్త సుఖాలను కలిగింపజేస్తుంది. మన జన్మరాశిని లెక్కపెట్టినప్పుడు వచ్చే 2,5,7,9 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది.
అంటే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. జన్మ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 1,4,8,12 రాశుల్లో గ్రహణం ఏర్పడితే.. ఆ గ్రహణం అధమ ఫలితాలను అంటే ఇబ్బందికర ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ప్రస్తుతం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభ రాశిలో ఏర్పడనుంది. దీని ప్రభావం ఏ రాశి వాళ్ల మీద అయినా 6 నెలల పాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు.
ధనస్సు రాశి:
ఈ రాశి వారికి ఈ చంద్ర గ్రహణం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. 6 నెలల పాటు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సోదరుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
కన్యా రాశి:
కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు.. గ్రహణం ఏర్పడుతున్న కుంభ రాశి 6వ రాశి అవుతుంది. కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం.. ఈ రాశి వాళ్లకు ఆరో స్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ రాశి వారికి విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. 6 నెలల వరకు కన్యా రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అప్పులన్నీ తీర్చగలుగుతారు. రుణ బాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. శత్రు బాధలు సమూలంగా తొలగిపోతాయని పండితులు తెలిపారు.
వృషభ రాశి:
ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభ రాశి 10వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్లకి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. 10వ స్థానం అంటే వృద్ధి స్థానం. దీంతో ఈ రాశి వారు వచ్చే 6నెలలు ఏ రంగంలో ఉన్నా..చక్రం తిప్పుతారట. వృత్తి పరంగా టాప్‌లోకి వెళ్లిపోతారట. ప్రమోషన్లు రావటం, ఇంక్రిమెంట్స్ రావటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే విజయవంతం అవుతాయి. కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగడానికి వృషభ రాశి వాళ్లకు అవకాశం ఉందట.
మేష రాశి:
గ్రహణం యోగించే నాలుగో రాశి మేష రాశి. మేష రాశి నుంచి చూస్తే గ్రహణం ఏర్పడుతున్న కుంభ రాశి 11వ రాశి. ఈ రాశి వాళ్లకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పదకొండో స్థానంలో ఏర్పడుతుంది. 11వ స్థానం అంటేనే లాభం. అంటే మేష రాశి వారికి లాభ స్థానంలో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా లాభం జరుగుతుంది. అన్ని విషయాలు, అన్ని వ్యవహారాలలో మేష రాశి వారికి 6 నెలల పాటు విశేషమైన రాజయోగం, అద్బుతమైన లాభాలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ధనస్సు రాశి, కన్యా రాశి, మేష రాశి, వృషభ రాశి వాళ్లు గ్రహణం సందర్భంగా ఎలాంటి దానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణం సమయంలో నియమాలు పాటిస్తూ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. లేదా మంత్రాలు జపించుకోవాలి. ఇలా చేస్తే మీకు వచ్చే మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి.
Also Read: పితృపక్షం.. కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే..! ఇలా చేస్తే పితృశాపాలు తొలగి అదృష్టం కలుగుతుంది..!