Today Horoscope : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.. ఆరోగ్యం కుదటపడుతుంది!

ఈ రోజు (ఆదివారం, నవంబర్ 17, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope

Today Horoscope : జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామసంవత్సర కార్తిక బహుళ విదియ రా. 9:06, రోహిణి : సా. 5:22. ఆదివారము. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితములు :

మేషం : అనారోగ్యం నుండి కోలుకుంటారు. ఆర్ధికంగా బాగుపడుతారు, మీ యొక్క మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఎక్కువగా క్రీడలలో పాల్గోంటారు. కుటుంబం కోసం పోరాడతారు. మీ భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. సుదర్శన కవచము చదవడం వల్ల మంచి ఫలితములు కలుగుతాయి.

వృషభం :
ఉద్యోగ అవకాశములు, ప్రముఖ వ్యక్తులతో పరిచయములు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధిక ప్రయాణములు, అధిక ఖర్చులు పెరగడం, మీ భాగస్వామికి బాగా సపోర్ట్‌గా నిలుస్తారు. నూతన వ్యాపార అవకాశములు, విద్యార్థులకు అనుకూలం. సుందర కాండా పారాయణం వలన శుభం కలుగుతుంది.

మిధునం :
పనులలలో ఆలస్యం, స్త్రీల ద్వారా తగాదాలు, మనఃశాంతి లోపించడం. మనస్థాపము, భయము, మనోవేదన, సరియైన నిర్ణయము తీసుకోలేకపోవడం. బంధు విరోధములు, వ్యాపారములో జాగ్రత్త అవసరము, ఆంజనేయస్వామి ఆరాధన చేసిన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కర్కాటకం :
బుద్ధి చాంచల్యము, రావలసిన బాకీలు వసూలు కాకపోవడం. ప్రయాణముల మందు ఇబ్బందులు, నీచస్త్రీ మూలక కలహములు, జాయింటు వ్యాపారులతో ఇబ్బందులు, పై అధికారుల వత్తిడి. ఆరోగ్యము కుదుట పడుతుంది. శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమం.

సింహం :
పిత్రార్జితం కలిసి రావడం, కోర్టు సమస్యల పరిష్కారము కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగు పొరుగు వారితో అనుకులము, సంతోషముగా ఉంటారు. ఇష్ట దైవము ఆరాధన చేయడం మంచిది.

కన్యా :
ఉద్యోగ భద్రత అవసరము. ప్రతి పనిలో విజయం సాధిస్తారు, అనవసరపు విషయముల వైపు వెళ్లకూడదు. వ్యాపారాలో మార్పులు, విదేశాలకు వెళ్లడం. స్త్రీసుఖం, నూతన ఆలోచనలు ప్రతి పనిలో విజయం సాధించడం, జీవితంలో మార్పులు చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు రావడం, కోర్టు సమస్యలు, పిత్రార్జితము కలసి రావడం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

తుల :
అనుకోని సమస్యలు, సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం, వ్యాపారంలో ఇబ్బందులు, నూతన గృహనిర్మాణం, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు రావడం, ప్రయూణంలో నష్టం, బాగస్వామ్యంలో తగాదలు, భార్యభర్తల మధ్య విరోద భావములు, విద్యార్థులకు అనుకూలము, దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయడం వల్ల శుభం ఫలితములు కలుగుతాయి.

వృశ్చికం :
అపకీర్తి, స్థానచలనము, మానసిక ఆందోళనలు, అగౌరవము, అధికారుల ఒత్తిడి. వ్యాపారంలో జాయింటు దారులమధ్య గోడవలు, విధ్యార్థులకు అనుకూలము, ధనఆదాయం పెరగడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, నవగ్రహములకు ప్రదక్షిణ చేయడం వల్లమంచి జరుగుతుంది.

ధనస్సు:
శుభవార్తలు, విందుభోజనం నూతన లాభములు, ప్రముఖవ్యక్తుల కలయిక ద్వారా అధిక లాభములు, స్త్రీలకు ఉన్నతమైన ఆలోచనలు, విదేశీయాన ఏర్పాట్లు జరగడం, సరియైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధనవల్ల శుభ ఫలితములు వస్తాయి.

మకరం :
ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో చికాకులు, ప్రయాణంలో ఆటంకములు, అకస్మిక ధనలాభము, బుణ బంధలు తగ్గటం, బ్యాంక్ లోన్లు రావడం, శుభకార్యనిర్వాహణ, తీర్ధయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన, వాహన సౌఖ్యం, ప్రతి పనిలో విజయం సాధించడం, విలువైన వస్తువులు కొనడం, గృహమరమ్మత్తులు, భూసంబధ వ్యవహారములలో అనుకులం, అగ్రిమెంట్లు ఒప్పందాలు కుదుర్చుకోవడం, శ్రీ రాజరాజేశ్య అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

కుంభం :
మనఃశాంతి లేకపోవడం, ఋణ బాధలు ప్రయాణాల్లో ఆటంకములు, తీర్థయాత్రలు, ధనము విషయములో జాగ్రత్త అవసరం, నిరాశ, కోర్టు తీర్పులు వాయిదా, గర్భిణులకు శుభవార్తలు, స్థానచలనము, బదిలీలు, ప్రమోషన్లలలో వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితమలు, ఆలస్యంగా అనుకూలత, శుభకార్య చర్చలు వాయిదా, నాగదేవత ఆరాధ్య వలన సమస్యలు తోలగిపోతాయి.

మీనం :
ధననష్టం, ధనం పొదుపు పాటించాలి, మనస్పర్థలు, గర్భ సంబంధ అనారోగ్యం స్త్రీలకు, నిద్రలేమి, అకారణ వైరము, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉష్ణసంబంద వ్యాధులు, మానసిక ఆందోళనలు
చంద్రగ్రహ ఆరాధన వలన శుభఫలితములు కలుగుతాయి.

 

 

 

 

 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956