జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ దశమి రాతె 5:23, ఆశ్రేష ఉ 9:46, తదుపరి మఘ మ 12:24 మరుసటి రోజు వరకు శనివారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు.
మేష రాశి: సంతోషం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ధనలాభము, సర్వత్రా శుభములు కలగడం, ధర్మకార్యాచరణ, శారీరక సౌఖ్యం, వ్యాపార ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరగడం: గౌరి పూజ చేయడం వల్ల శుభములు కలుగుతాయి
వృషభ రాశి: ప్రయత్న కార్యసిద్ధి, నూతన వస్త్రప్రాప్తి, ధనధాన్య సమృద్ధి కలుగును, ఆరోగ్యం, విలువైన వస్తువులు కొనుగోలు, తీర్ధయాత్రలు చేయడం, ప్రయాణముల విషయంలో జాగ్రత్త అవసరం, స్త్రీలకు నూతన ఆలోచనలు, వ్యాపార విస్తరణ : గణపతి ఆరాధన వలన మంచి జరుగును.
మిథున రాశి: పనులలో ఆలస్యం, స్త్రీ ద్వార ఆగాధలు, మనశ్శాంతి లోపించడం, మనస్తాపము, భయము, మనోవేదన, సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, బంధు విరోధములు, వ్యాపారములో జాగ్రత్త అవసరము: ఆంజనేయస్వామి ఆరాధన చేసిన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి: బుద్ధి చాంచల్యము, రావలసిన బాకీలు వసూలు కాకపోవడం, ప్రయాణములు యందు ఇబ్బందులు, నీచ స్త్రీ మూలన కలహములు, జాయింటు వ్యాపారులతో ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిడి, ఆరోగ్యము కుదుట పడుతుంది: శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమము.
సింహ రాశి: పిత్రార్జితం కలిసి రావటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగు పొరుగు వారితో అనుకూలము, సంతోషముగా ఉంటారు: ఇష్ట దైవ ఆరాధన చేయడం మంచిది.
కన్యా రాశి: ధన సంపద పెరగడమే, నూతన వ్యాపారము, విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, ఉద్యోగంలో శుభఫలితములు, శుభ కార్యక్రమములలో పాల్గోనుట, వివాహ ప్రయత్నములు సఫలీకృతం కావడం, దుర్గాస్తోత్ర పారాయణం చేయడం మంచిది.
తులా రాశి: ఆనందం, ధనం చేతికి అందడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, బంధు మిత్రులతో వినోదములు, విందులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు: సూర్యనమస్కారములు చేయడం ఉత్తమం.
వృశ్చిక రాశి: అధికారుల ఆగ్రహం, అవరోదములు, ప్రయాణములలో ఆటంకములు, గొడవలు, బంధుమిత్రులతో సహనం పాటించాలి. శుభకార్యక్రమాలలో పాల్గోనటం, సోమరి తనం, అపాయములు – రుద్రజపం చేసిన మంచి జరుగును.
ధనస్సు రాశి: నూతన వ్యాపారము, నూతన ఉద్యో గాలు, శుభవార్తలు, ధన ధాన్య లాభములు, ఇష్టమైన వ్యక్తుల కలయిక, వృత్తి ఉద్యోగములయందు లాభములు కలుగుతాయి, మాట పట్టింపులు, ప్రయాణములో అలసట: సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం ఉత్తమం.
మకర రాశి: నూతన వ్యక్తుల పరిచయం, విద్యార్థులకు అనుకూలము, వెండి బంగారు వంటి నగలు, విలువైన దుస్తులు కొనుగోలు చేస్తారు, చేయు వృత్తి వారికీ లాభములు కలుగును, ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి ఉండును: శివసహస్రనామార్చన ఉత్తమము.
కుంభ రాశి: స్థానభ్రంశము, అన్యస్థల నివాసం, కోర్టు సమస్యలు, మోసపోవడం, కుటుంబ కలహములు, మానసిక ఆందోళనలు, పుత్ర మిత్ర విరోధములు కలుగును, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం: అమ్మ వారి ఆరాధన వలన మేలు కలుగును.
మీనా రాశి: వ్యాపారాలలో లాభాలు , తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాలు, నూతన వ్యాపారములు, ఋణ బాధలు తగ్గడం, విరోధములు, మోకాళ్ళ నొప్పులు, ఉద్యోగంలో అనుకూలత, అనారోగ్యము: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మంచిది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956