×
Ad

Diwali 2025: లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించే రాళ్ల ఉప్పు.. వ్యాపారంలో లాభం.. మీపై డబ్బుల వర్షం కురవాలంటే..

దీపావళి పండుగ రోజున ఉప్పుతో కొన్ని పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఉప్పుతోనే ఎందుకు చేయాలి..?ఉప్పులో ఉండే గుణాలు ఏంటీ..? మరి ఏంటా పనులు అనే విషయం తెలుసుకుందాం..

Diwali

Diwali 2025: దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాన్నే లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజించే పండుగ. దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతారు. అంటువంటి లక్ష్మీదేవిని ఇల్లంతా నింపే పండుగ దీపావళి. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేసిన దీపాలు వెలిగిస్తారు. అటువంటి దీపావళి పండుగ రోజు ఉప్పును ఉపయోగించి చేసే పని వల్ల అదృష్టం వరిస్తుందంటారు. అంటే లక్ష్మీదేవీ కటాక్షం కలుగుతుందంటారు. మరి ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకుందాం..

ఏదైనా ఒక గాజు సీసా తీసుకుని దాన్ని ఉప్పుతో నింపి …ఆ సీసాని ఇంట్లో ఏదో ఒక మూల పెట్టుకోవాలి. బాత్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. అలా పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు అన్ని బయటకు పోయి..పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలా పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే పూర్వం దిష్టి తీసేవారు. దిష్టి తీయటం అనేది చాలా రకాలుగానే చేస్తారు. కానీ దిష్టిలో ఉప్పు (రాళ్ల ఉప్పు) చాలా ప్రధానమైనది. రాళ్ల ఉప్పును చేతి నిండా తీసుకుని సదరు వ్యక్తికి దిష్టి తీస్తారు. ఇంట్లో ఎవరికయినా దిష్టి తగిలినట్టు అనిపిస్తే, గుప్పెడు ఉప్పుని తీసుకుని దిష్టి తగిలిన వారిపై మూడు సార్లు తిప్పి పడేయడం చూస్తూ ఉంటాం. అంతేకాదు స్నానాల గదిలో ఒక మూల గాజు బౌల్ తో ఉప్పుని పెడితే, వాస్తు దోషం ఉండదట. ఇలా చాలా మంది చేస్తుంటారు.

Diwali 2025: ధనత్రయోదశి రోజు మృత్యు దోషాన్ని తొలగించే ‘యమదీపం’.. బంగారం, వెండి ఎందుకు కొనాలి?

ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు మూట కట్టి ఇంటి ముఖద్వారానికి కడితే దానికింద నుంచి ఇంట్లోకి ఎలాంటి శక్తులు రాకుండా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఉప్పు మూటని వ్యాపార స్థలాల్లో కూడా కట్టుకుంటారు. అలాగే బీరువాలో కూడా పెట్టుకుంటే మంచిదట. అలా చేయడం వలన వ్యాపారంలో మంచి లాభం వస్తుందని పెద్దలు సూచించేవారు. పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్లలో వేసి కాళ్లు, చేతులు కడుక్కుంటే, సుఖ నిద్ర పడుతుందట. పిల్లలకు వారానికి ఒకసారి చిటికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు ఎక్కువగా రావని చెబుతున్నారు.

దిష్టి తీసిన ఉప్పుని చాలామంది రోడ్డుపై వేస్తుంటారు. కానీ అలా వేయకూడదు. నీటిలో గానీ నిప్పులో గానీ వేయాలి. నీటిలో వేస్తే దిష్టి కూడా నీళ్లలో కలిసిపోతుంది.అలాగే నిప్పుపై వేస్తే చిటపటమంటూ నెగిటివ్ ఎనర్జీ అంతా కాలిపోతుందట. కాబట్టి అందరు నడిచే రోడ్లమీద వెయ్యకుండా నీటిలో గానీ నిప్పు మీద గానీ వేయాలంటారు.

Note: ఈ కథనం.. విశ్వాసాలు, సంప్రదాయ పద్ధతులకు సంబంధించిన వివరణ మాత్రమే. వీటిపై నిర్ణయాలను అర్హులైన వారిని సంప్రదించి తీసుకోవాలి. ఇటువంటివి ప్రాంతీయ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి. ఈ కథనంలో ఉన్న విషయాల గురించి శాస్త్రీయ నిర్ధారణ లేదు. వీటిని వ్యక్తిగత విశ్వాసాలుగా మాత్రమే తీసుకోండి.