Horoscope Today : విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఈరోజు ఈ రాశివారికి తిరుగులేదంతే..!
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
- Naveen
- Published On : March 22, 2025 / 05:00 AM IST
Today Horoscope
Horoscope Today : నీచ వీడిన చంద్రుడు ఈరోజు దాదాపు అన్ని రాశులనూ అనుగ్రహిస్తాడు. గ్రహరాజు కూడా ఈరోజు ప్రసన్న ఫలితాలు అందిస్తున్నాడు. రాహువు ప్రభావంతో కొన్నిరాశుల వారికి చికాకులు ఉంటాయి. మీనానికి సమీపిస్తున్న శని మకరరాశికి మేలు చేయనున్నాడు.
Aries
మేషం: సాహసించి పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక పని విజయవంతం అవుతుంది. రామాలయాన్ని సందర్శించండి.
Taurus
వృషభం: ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. శివారాధన శుభప్రదం.
Gemini
మిథునం: నిన్నటి కన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. భూ లావాదేవీలు అనుకూలం. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
Cancer
కర్కాటకం: అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు. వ్యాపారులను అదృష్టం వరిస్తుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
Leo
సింహం: ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. సాయంత్రం ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
Virgo
కన్య: రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. విందు పిలుపు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి సమయం. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
Libra
తుల: చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుబంతో కాలం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Scorpio
వృశ్చికం: సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా.. పట్టుదల వీడరు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. భవిష్యత్తుకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Sagittarisu
ధనుస్సు: ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు తల్తెవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిడికి గురవుతారు. సంయమనంతో వ్యవహరించండి. రోజు చివరిలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. రామాలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.
