మీ దోషాలను అధికం చేసే జ్యోతిష్య యోగములు ఇవే.. శరీరమంతా రోగాల కుప్ప.. మీలోని ఏ దోషానికి ఎలాంటి దుష్ఫలితాలు?

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

మీ దోషాలను అధికం చేసే జ్యోతిష్య యోగములు ఇవే.. శరీరమంతా రోగాల కుప్ప.. మీలోని ఏ దోషానికి ఎలాంటి దుష్ఫలితాలు?

Kaal Sarp Dosh

Updated On : October 3, 2025 / 2:59 PM IST

Kaal Sarp Dosh: రాహువు, కేతువుల మధ్య సప్తగ్రహములుంటే దానిని కాలసర్పయోగము అంటారు. మానవ పుట్టుక నుంచి మరణముదాకా.. శరీరము, వ్యక్తిత్వం, జీవితంపై గ్రహముల ప్రభావము ఉంటుంది. మానవ జీవితము నవగ్రహములపై ఆధారపడి ఉంటుంది. ఈ రాహువు కేతువులతో సూర్యచంద్రులకు గొప్ప అనుబంధం ఉంది.

సూర్యచంద్రులకు గొప్ప అనుబంధం ఉంది. సూర్యచంద్రుల గురించి తెలుసుకుందాము. ఈ మొత్తము జగత్తుకు ఆత్మకారకుడు సూర్యుడు ఈ చరాచరసృష్ఠికి అవసరమైన శక్తిని ప్రసాదించే గ్రహం సూర్యుడు. ఈ సూర్యుని వల్లే సృష్టి జరిగింది. సూర్యుడులేని జీవితాన్ని ఊహించడం అసంభవం.

అలాగే చంద్రుడు భూమికి ప్రకృతిని ప్రసాదించే ఉపగ్రహము. సూర్యుని వెలుగుతో ప్రకాశిస్తూ తన చల్లటికాంతితో భూమికి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. సూర్యుడు శక్తికి, చంద్రుడు మనస్సునకు కారకులు. సూర్యచంద్ర మార్గాలను విభజించే ప్రతిచ్ఛేదన బిందువులు రాహుకేతువులు. ఈ గ్రహముల వల్ల సూర్యచంద్రుల స్వభావము గుణములో మార్పు కలుగుతుంది.

ఈ కారణంగానే అనేక పురాణాలలో రాహుకేతువులకు విశిష్ఠ స్థానము ఇచ్చారు. రాహువు స్థితుడై ఉన్న రాశి నుంచి 7వ రాశిలో అంశాత్మక స్థితిలో కేతువు ఉంటాడు. రాహుకేతువులు సూర్యచంద్రుల కక్ష్యల సంధి బిందువు. ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని చంద్రపాతమని అంటారు. ఈ రెండు గ్రహాలకు ప్రతిబింబంలేని కారణంగా ఛాయాగ్రహరూపంలో ఉన్నా మానవ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితము చేస్తాయి.

జాతకములో కాలసర్పయోగప్రభావాన్ని అధికముచేసే జ్యోతిష యోగములు కూడా ఉన్నాయి.

1. జన్మకుండలిలో రాహువు, గురువులు ఏ స్థితిలోనైనా కలిసి గురు చండాల యోగము ఏర్పడితే కాలసర్పయోగము ప్రభావము ఎక్కువగా ఉంటుంది.

2. జాతక చక్రంలో శుక్రుడు, రాహువు కలవడము వల్ల అభోత్వకయోగము ఏర్పడుతుంది. ఈ యోగమువల్ల కూడా కాలసర్పయోగం అధికము అవుతుంది.

3. జన్మకుండలిలో కుజుడు, రాహువులు కలవడం వల్ల అంగారక యోగము కలిగి(జాతకంలో) ఉండి దీనివల్ల కూడా కాల సర్పయోగము అధికము అవుతుంది.

4. జాతక కుండలిలో శని, రాహువుల కలయికవల్ల నందీయోగము జాతకంలో కాలసర్పదోషము ఉంటే దీర్ఘకాలిక రోగములు వస్తాయి.
5. జాతకంలో అమావాస్య దోషము ఉంటే కాలసర్పదోష ప్రభావము ఎక్కువగా ఉంటుంది.