Budh Uday 2026 : ఉగాది పండగకు ముందు అద్భుతం.. మార్చి 18 నుంచి బుధుడి అద్భుతం.. ఈ రాశుల వారికి కనక వర్షమే..!

Budh Uday 2026 : ఉగాది పండగకు ఒక్క రోజు ముందు అంటే మార్చి 18 అద్భుతం జరగబోతుందని.. దీని వల్ల పలు రాశులను అదృష్టం వరిస్తుంది అంటున్నారు.

mercury rise budh uday on march 18 golden period start and financial fortune for these zodiac signs

Budh Uday 2026 : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహ గమనాల్లో మార్పులు మానవ జీవితాలపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి అంటారు. పలు రాశుల ఉదయాస్తమయాలు కూడా మనుషులపై ప్రభావం చూపుతాయంటున్నారు. ఈ క్రమంలోనే బుద్ధి, బిజినెస్, సంభాషణ చాతుర్యానికి కారకుడైన బుధుడు మార్చి 18న ఉదయించబోతున్నాడని.. దీనివల్ల పలు రాశుల వారికి అదృష్టం వరించబోతుంది అంటున్నారు. ప్రస్తుతం బుధుడు కుంభ రాశిలో అస్తమించి ఉన్నాడు. అయితే ఉగాదికి ముందు రోజు అనగా మార్చి 18న బుధుడు కుంభ రాశిలోనే తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉదయించబోతున్నాడు.

వేద జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే.. ఏదైనా గ్రహం ఉదయించినప్పుడు.. దాని శక్తి రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ఇలా రెట్టింపైన శక్తి.. కొన్నిసార్లు అన్ని రాశుల మీద.. కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలానే మార్చి 18న కుంభ రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని.. వారిపై కనక వర్షం కురుస్తుందని అంటున్నారు. మరి ఇంతకూ ఆ రాశులు ఏవంటే..

మేష రాశి
బుధోదయం వల్ల మేలు కలిగే వారిలో మేష రాశి ఒకటి. బుధోదయం వల్ల మేష రాశి ఉద్యోగులు, వ్యాపారస్తులు భారీగా లాభపడతారని.. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు.. ఇప్పటికే కొనుగోలు చేసిన ఆస్తుల వల్ల భారీ లాభం కలిగే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. అలానే బుధోదయం నుంచి మేష రాశి వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నారు.

తులా రాశి
బుధోదయం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందబోయే మరో రాశి తులా రాశి. బుధోదయం వల్ల తులా రాశి ఉద్యోగస్తుల జీతం రెట్టింపు అవుతుందని.. డబ్బులను భారీగా పొదుపు చేస్తారని.. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని.. ప్రేమికులకు కలిసి వచ్చే కాలం అంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారని చెబుతున్నారు.

కుంభ రాశి
బుధుడు కుంభ రాశిలోనే ఉదయిస్తుండటం వల్ల ఈ రాశి వారికి ఊహించని రీతిలో అద్భుతాలు జరుగుతాయని.. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని.. కోర్టు కేసులు వంటివి పరిష్కారం అవుతాయని అంటున్నారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి అవి ఫలించి మంచి జీవిత భాగస్వామిని పొందుతారని.. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం అంటున్నారు. కొత్త వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం అంటున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.