Simha Rasi Phalalu 2026 : సింహ రాశి వారికి 3 నెలలు మాత్రమే అదృష్టం.. ఆ తర్వాత రెండేళ్ల పాటు అన్నీ కష్టాలే.. ఈ ఒక్క పని చేస్తే..!

Simha Rasi Phalalu 2026 : పరాభవ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదంటున్నారు పండితులు.

Parabhava nama samvatsara ugadi panchangam 2026 simha rasi phalalu leo horoscope

Simha Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదంటున్నారు పండితులు. జూన్ వరకు మాత్రమే కాలం కలిసి వస్తుందని.. ఆ తర్వాత రెండేళ్ల పాటు అనుకూల సమయం లేదని తెలిపారు. కనుక సింహ రాశి వారు జూన్ లోపే అప్పులు తీర్చి.. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. సింహ రాశి వారిపై అష్టమ శని ఉండటం వల్ల భాగ్య నష్టం, తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలున్నాయని.. దూర ప్రయాణాలు మానుకుంటే మంచిదని.. ఒకవేళ చేయాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆదాయం: 11 వ్యయం: 2 రాజపూజ్యం: 5 అవమానం: 4

సింహ రాశి వారికి 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు దెబ్బతింటాయని.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం ఉందంటున్నారు. కొందరికి సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కొన్ని సార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. అలానే జూన్ తర్వాత ఎవరైనా సలహాలు అడిగితే తప్పించుకోవడం ఉత్తమం అంటున్నారు.

జూన్ నుండి అక్టోబర్ 31 : గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో అప్పులు తీర్చడం, శుభకార్యాలు చేయడం లేదా టూర్లకు వెళ్లడం ద్వారా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. వచ్చిన ధనాన్ని భోగాల కోసం ఖర్చు చేయడం మంచిది.

అక్టోబర్ 31 నుండి జనవరి 24: గురువు సింహ రాశిలోకి వస్తాడు. ఈ సమయంలో మౌన వ్రతం పాటించడం లేదా ఒంటరిగా తీర్థయాత్రలు చేయడం మంచిది. భార్యాపిల్లలతో కాకుండా ఒంటరిగా బిజినెస్ టూర్లు లేదా రీసెర్చ్ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. 2027 జూలై తర్వాతే మళ్ళీ మంచి టైమ్ వస్తుంది.

ముఖ్యమైన పరిహారాలు:

  • అక్షయ తృతీయ: అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవడం వల్ల రాబోయే రెండేళ్ల విపత్తుల నుండి రక్షణ ఉంటుంది.
  • వారాహి మాల: రాహు, శని దోషాల నివారణకు మెడలో వారాహి మాలను ధరించాలి.

ఆలయ దర్శనం:

  • శ్రీమూష్ణంలోని భూవరాహ క్షేత్రాన్ని తప్పక దర్శించుకోవాలి (ముఖ్యంగా వ్యాపారస్తులు).
  • శ్రీరంగం, చిదంబరం క్షేత్రాలను కూడా దర్శించడం మంచిది.
  • ఈ సంవత్సరం అప్పులు చేయకూడదు, కానీ రియల్ ఎస్టేట్ లేదా మధ్యవర్తిత్వ వ్యాపారాలు బాగుంటాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.