Ramadan 2025 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస నియమాలేంటి..? మీ నగరంలో సెహ్రీ, ఇఫ్తార్ సమయం ఎప్పుడో తెలుసా? ఫుల్ డిటెయిల్స్

Ramadan 2025 : పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఇస్లాంలో రంజాన్ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇస్లాం మతస్థులు ఉపవాసాలు పాటిస్తారు. నగరాల వారీగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాల వివరాలు ఇలా ఉన్నాయి.

Ramadan 2025

Ramadan 2025 : పవిత్ర రంజాన్ మాసం మార్చి 2 నుంచి ప్రారంభమైంది. రంజాన్ అనేది సంవత్సరంలో 9వ నెల. ఇస్లాంలో రంజాన్ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో ఇస్లాం మతస్థులు తమ దేవుడిని పూర్తి భక్తితో పూజిస్తారు. కఠిన ఉపవాసాలు పాటిస్తారు. ప్రతిరోజూ ఉపవాసం ఉండే ముస్లింలు రంజాన్ చివరి రోజున అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు.

ఇస్లాం విశ్వాసాల ప్రకారం.. భారత్‌లో రంజాన్ నెల ఎప్పుడు, ఏ రోజున ప్రారంభమవుతుందనేది మక్కాలో చంద్రుడిని చూడటంపై ఆధారపడి ఉంటుంది. సౌదీ అరేబియాలో చంద్రుడు కనిపించిన మరుసటి రోజున మనదేశంలో రంజాన్ ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ముస్లింలు మొదటి ఉపవాసం పాటిస్తారు.

రంజాన్ ఉపవాస నియమాలు :
ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు నిష్టగా పాటిస్తారు. ఇస్లాంలో ఉపవాసం కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు ఆహారం తినవచ్చు. దీన్నే సెహ్రీగా పిలుస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఏదైనా తినవచ్చు. దీనినే ఇఫ్తార్ అంటారు.

ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫాస్టింగ్ ఉంటారు. రంజాన్ 30 పవిత్ర దినాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులను రహ్మత్ అని, ఆ తరువాతి 10 రోజులను బరాక్ అని, చివరి 10 రోజులను మగ్ఫిరత్ అని పిలుస్తారు. ఈ సంవత్సరం మీ నగరంలో సెహ్రీ, ఇఫ్తార్ సమయం ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నగరాల వారీగా సెహ్రీ సమయం, ఇఫ్తార్ సమయాలివే :

  • హైదరాబాద్‌లో ఉదయం 05:22 సాయంత్రం 06:23
  • బెంగళూరులో ఉదయం 05:24 సాయంత్రం 06:29
  • చెన్నైలో ఉదయం 05:13 సాయంత్రం 06:19
  • ఢిల్లీలో ఉదయం 05:28 సాయంత్రం 06:22
  • నోయిడాలో ఉదయం 05:25 సాయంత్రం 06:24
  • ముంబైలో ఉదయం 05:44 సాయంత్రం 06:45
  • కోల్‌కతాలో ఉదయం 04:42 సాయంత్రం 05:41
  • కాన్పూర్‌లో ఉదయం 05:14 సాయంత్రం 06:11
  • లక్నోలో ఉదయం 05:12 సాయంత్రం 06:08
  • మీరట్‌లో ఉదయం 4:49 సాయంత్రం 05:46
  • అహ్మదాబాద్‌లో ఉదయం 05:45 సాయంత్రం 06:45
  • పాట్నాలో ఉదయం 04:55 సాయంత్రం 05:53
  • రాంచీలో ఉదయం 04:53 సాయంత్రం 05:57