Ys Jagan: శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం..

దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకొస్తాయని, ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని జగన్ అన్నారు.

  • Updated on- April 14, 2026 / 10:28 PM IST

Ys Jagan: శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లి నివాసంలో జగన్ ని కలిసి శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి ఆహ్వానం పలికారు. శ్రీమన్నారాయణ మహాయజ్ఙ ఆహ్వాన పత్రికను జగన్ కు అందజేశారు రామానుజ జీయర్‌ స్వామి.

కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్ధానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది. ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించారు జగన్. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించారు. ఆలయ విశిష్టతను జగన్ కు వివరించిన జీయర్‌ స్వామి.. మహాయజ్ఞానికి ఆహ్వానించారు. దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకొస్తాయని, ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని జగన్ అన్నారు.