జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ బహుళ అమావాస్య: సా.6:16, స్వాతి: రాతె 3.31 శుక్రవారం, ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు.
మేష రాశి: అనుకున్న పనులు నెరవేరటం, అధిక ఆదాయం, మానసిక ఆందోళనలు కలగడం, ప్రయాణములు, లాభములు, అధిక ఒత్తిడి, శుభ కార్యనిర్వాహణ, గౌరవమర్యాదలు పెరగడం, కోర్టు సమస్యలు రావడం, వ్యాపారములో లాభములు, అధిక ప్రయాణములు, విదేశీయానం ప్రతిపనిలో విజయవంతం కావడం. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ప్రముఖులతో పరిచయములు, వ్యాపారములో లాభములు, శ్రమను వృథా చేసుకోకూడదు, అవకాశాలు వినియోగించుకోవాలి, ధన ధాన్యలాభములు, కుటుంబంలో సంతోషము, విధ్యార్థులకు అనుకూలము, ఉద్యోగ వ్యాపారములో అధిక ఆదాయం, విదేశీయానం, దూరపు ప్రయాణములు. దత్తాత్రేయ కవచం పారాయణము చేసిన ఉత్తమ ఫలితాలు వస్తాయి.
మిధున రాశి: మీరు ప్రేమించిన వారితో వివాదములు రాకుండా చూసుకోండి, అధిక లాభములు, ఏ రంగంలో అయినా అభివృద్ధి, కుటుంబములో వారికి ఆరోగ్యము, విద్యావంతులు గౌరవ సన్మానములు పొందుతారు, వివాహ సంబంధములు కుదురుతాయి, పిత్రార్జితము ద్వారా ధనము కలసి వస్తుంది. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసినచో శుభ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి: మనస్తాపం, ఉద్యోగ లాభం, పనులలో ఆలస్యం, నిధానంగా జరగడం, స్వజనులతో విరోధము, అకాల భోజనం, ఉద్యోగంలో అనుకూలత, ప్రయాణముల వలన లాభం, ప్రతిపనిలో జయం, అధిలాభములు, నూతనవస్త్రముల కొనుగోలు. సుదర్శన మంత్రము చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి: అనవసర కార్యములకు ధనవ్యయం, అపకీర్తి, స్థాన చలనము, శరీరంలో వాతము, సోమరితనము, స్త్రీ మూలకముగా తగువుల వలన మనఃశాంతి లోపించును, మనో వేదనల వలన పనిర్ణయమునకు త్వరలో రాలేరు, వ్యాపారంలో నష్టము. శివ ఆరాధన చేసినచో అపాయములు తొలగుతాయి.
కన్యా రాశి: ధనము కలసి రావడం, ప్రేమ పెళ్లిళ్లు, ఇరుగు పొరుగు వారితో అనుకూలత కలుగును, బంధు వర్గంలో గౌరవము, ఆధిక్యతలు కలుగును, సంతోషముగా కాలము గడుపుతారు, విందు వినోదములు, శుభకార్య నిర్వాహణ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయవలెను.
తులా రాశి: రోగ భయము, ఉద్యోగంలో అనుకూలం, అకాల భోజనములు కలుగును, నమ్మిన వారివలన మోసపోవడం, స్త్రీ మూలకంగా చికాకులు, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రతి పనిలో విజయం, రహస్యములు దాచటం, ప్రమాణములలో ఆటంక
ములు. దేవి స్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమమైన ఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: బంధు మిత్రులతో విందులు, వినోదములు, విలువైన వస్త్రములు కొనుగోలు చేయడం, ధన, వృత్తి విషయంలో అభివృద్ధి, ఆనందముగా కాలము గడుపుతారు, వ్యాపారంలో మంచి లాభములు, మానసిక వేదనలు. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆరాధనం వల్ల శుభం కలుగుతుంది.
ధనస్సు రాశి: ప్రయణంలో ప్రయాసలు కలుగుట, వివాహాది శుభకార్యక్రమములకు ఆటంకములు కలుగును, పై అధికారులతో మాటలు పడవలసి వచ్చును, బంధు, పుత్ర, మిత్రులతో మాటామాట పట్టింపులు కలుగును, మనసుకు ఇబ్బందికరమైన సంఘటన కలుగును. దత్తకవచ పారాయం చేయవలెను శుభం జరుగును.
మకర రాశి: విందు వినోదములు, లాభదాయకమైన ప్రయాణములు, సహాయ సహకారములు, వృత్తి, ఉద్యోగముల మందు ఉహించని లాభములు, ఇష్టులైన వారితో అనుభవజ్ఞలతో సలహా సంప్రదింపులు చేస్తారు. శివారాధన వలన మేలు జరుగుతుంది.
కుంభ రాశి: తలచిన ప్రతి పని కార్యముదాల్చును, గొప్పవ్యక్తులు, నూతన వ్యక్తులతో పరిచయములు కలుగును, ఫ్యాన్సీ, వెండి, బంగారు, నగలు, విలువైన దుస్తులు కొనుగోలు చేస్తారు. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారములలో అభివృద్ధి, రాణింపు ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవలన మంచి జరుగుతుంది.
మీనం: స్థానచలనం, పేరు ప్రఖ్యాతలు కలగడం, అన్నింటా విజయము, వృత్తి, ఉద్యోగములలో అభివృద్ధి, రుణబాధలు తగ్గుతాయి, భార్యాపిల్లల మాట వింటారు, మధుర భోజనములు చేస్తారు. ధనలాభం, గౌరవ సన్మానములు పొందుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956