Horoscope Today
Horoscope Today : మీనంలో కొనసాగుతున్న చాతుర్ గ్రహ కూటమి కొత్తదనాన్ని సంతరించుకుంది. శనిని అధిగమించి రాహువు వెళ్లిపోయి శుక్రుడికి చేరువ అయ్యాడు. ఇన్ని రోజులు రాహువు దుష్ప్రభావం శుక్రుడిపై పడకుండా కాపు కాసిన శని.. ఇప్పుడు అదే రాహువుకు తన శక్తినీ ఇచ్చి.. శుక్రుడిపైకి దండయాత్రకు పంపినట్టు అయింది. ఈ నేపథ్యంలో… శుక్రుడు అధిపతిగా కలిగిన వృషభం, తుల రాశులకు, భరణి, పుబ్బ, పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులకు కొన్ని విపరీత పరిస్థితులు తప్పవు. అదే సమయంలో మేషం, సింహం, మకర రాశులకు అయాచిత మేలు కలుగుతుంది.
Aries
మేషం: సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. భరణి నక్షత్ర జాతకులు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకూడదు. వాదోపవాదాలకు తావు ఇవ్వకూడదు. హనుమాన్ చాలీసా పఠించండి.
Taurus
వృషభం: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. స్త్రీ మూలకంగా చికాకులు ఏర్పడతాయి. సాయంత్రానికి పరిస్థితి కొంత సద్దుమణుగుతుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
Gemini
మిథునం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులున్నాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం: విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. రామరక్షా స్తోత్రం వినండి.
Leo
సింహం: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు పరీక్ష సమయం. సంయమనం పాటించడం అవసరం. లలితా సహస్రనామాలు పఠించండి.
Virgo
కన్య: పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. అధికారుల ఆదరణ ఉంటుంది. సూర్యారాధన శుభప్రదం.
Libra
తుల: రావలసిన డబ్బు అందినట్టే అంది చేజారుతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
Scorpio
వృశ్చికం: పిల్లలు చదువులో రాణిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
Sagittarius
ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మనసు స్థిమితంగా ఉండదు. అనవసరమై విషయల్లో తలదూర్చి నష్టపోతారు. జాగ్రత్త పాటించాలి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
Capricorn
మకరం: ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
Aquarius
కుంభం: ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన శుభప్రదం.
Pisces
మీనం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులకు మంచి సమయం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.