జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ నవ రాతె 3 : 2, పుష్యమి ఉ 7.40 శుక్రవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు.
మేష రాశి: అన్ని విషయములలో శ్రద్ధ అవసరం, ప్రతి పనిలో విజయం సాధించడం, ప్రయాణములో లాభములు, ఆకస్మిక ధనలాభము, విద్యార్థులకు ప్రతికూల ఫలితములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్లు, వృత్తి వ్యాపారములలో అభివృద్ధి, ఇంటి నిర్మాణము, వాహన సుఖము: విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈ రోజున ఆవేశం తగ్గించుకోవాలి, అనవసరపు నిర్ణయాములు తీసుకోకూడదు, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వివాదములు రాకుండా నడుచుకోవాలి, ప్రముఖుల వలన లాభములు కలుగును, వ్యాపారములలో లాభములు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులకు అనుకూలంగా ఉండును: శ్రీ విషుస్తోత్ర పారాయణం చేయటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి.
మిథున రాశి: మీరు చేసే ఉద్యోగంలో లాభం కలుగును, పనులు చాలా తొందరగా జరుగును, చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి లాభములు వచ్చును, విదేశి యానము, నూతన వ్యాపారములు ప్రారంభించటం, విద్యార్థులకు అనుకూలము అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అనవసరపు రాద్ధాంతములు, కోర్టు సమస్యలు: గకార అష్టోత్తరముతో బాల గణపతిని పూజించడం వలన చాలా వరకు సమస్యలు తొలగి పోవును.
కర్కాటక రాశి: గొడవలు, తగాదాలు, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి, అనవసర ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు, అన్ని పనులు వాయిద పడటం, అధిక ఆదాయం, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడం, వాహనములు కొనుగోలు చేయడం, వివాదమలు – కార్త్యవీర్యార్జు స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభా ఫలితములు కలుగుతాయి.
సింహ రాశి: ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వివాహ విషయంలో ఆటంకాలు, సరైన నిర్ణయము లేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సర్దుబాటుతత్వం అలవర్చుకోవాలి, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, ప్రయాణంలో ఇబ్బందులు – ఇష్టదైవ ఆరాధన చేసినచో శుభ ఫలితములు వస్తాయి.
కన్యా రాశి: ప్రతి పనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి, శారీరిక సుఖం, కార్యసిద్ధి, శుభకార్యక్రమములో పాల్గోనుట, వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులలో లాభం, ధనాదాయం, గౌరవమర్యాదలు, కుటుంబంలో శుభములు: ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రము చదివినచో శుభం కలుగును.
తులా రాశి: పుణ్యాలు చేయడం, గౌరవ సన్మానాలు, గృహములో శుభ కార్యక్రమములు చేయడం, వధూవరులకు సంబంధములు కుదరడం, వృత్తి ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధన సమృద్ధి, విద్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి
వృశ్చిక రాశి: ధన విషయంలో జాగ్రత్త అవసరము, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరియైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురికావడం: గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు కలుతాయి.
ధనస్సు రాశి: బంధుమిత్ర వైరము, ప్రతి పనిలో ప్రతికూలత, ధనలాభం, వృత్తి ఉద్యోగములలో విజయం సాధించడం, మర్చిపోవడం, అలసత్వం, ప్రయాణముల వలన లాభం కలగడం, సుఖనిద్ర, సమాజంలో గౌరవము: శ్రీ మహాలక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఉత్తము ఫలితములు కలుగుతాయి.
మకర రాశి: విలువైన ఆభరణములు కొనడం, గృహ ఉపకరణ వస్తువులు కొనడం, శారీరక సౌఖ్యం, అన్నింటా అభివృద్ధి, ఆరోగ్యం కుదుటపడటం, స్త్రీలకు నూతన ఆలోచనలు పెరగడం, నూతన వస్త్ర ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, లలితా సహస్ర నామ పారాయణము చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
కుంభ రాశి: వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ అధికం, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము, బంధుమిత్రుల గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకరం: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.
మీనా రాశి: ఆకస్మిక ప్రయాణములు, స్థానచలనము, గృహములో మార్పులు, శుభమూలక ధనవ్యయం, శుభకార్యసిద్ధి, కోపంతో వివాదములు పెరుగుట, వస్తు వాహనములు కొనడం, ఆకస్మిక ధనలాభం, స్త్రీ మూలక వివాదములు: సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956