Horoscope Today: గ్రహరాజు రవి మీన రాశిలోకి ప్రవేశించడంతో చతుర్ గ్రహ కూటమి ఏర్పడింది. పైగా గ్రహాల మధ్య దూరం తక్కువగా ఉండటంతో.. గ్రహ యుద్ధం ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మేషం, సింహం, తుల, కుంభ రాశులకు ఈరోజు పూర్తి అనుకూల ఫలితాలు కలుగుతాయి.
Aries
మేషం: వ్యాపారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ లావాదేవీల్లో తొందర తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
Taurus
వృషభం: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబసభ్యులతో సంయమనంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.
Gemini
మిథునం: అదృష్టం కలిసివస్తుంది. కార్యసిద్ధి ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
Cancer
కర్కాటకం: ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు అందుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Leo
సింహం: ఈ రోజు సంతృప్తికరంగా గడుస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
Virgo
కన్య: ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనం పొందుతారు. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. విష్ణు ఆరాధన శుభప్రదం.
Libra
తుల: అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. మాటపట్టింపులకు పోకండి. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
Scorpio
వృశ్చికం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
Sagittarisu
ధనుస్సు: ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మేలుచేస్తుంది.
Capricorn
మకరం: ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. బంధువుల రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
Aquarius
కుంభం: కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. ఊహించని విజయం చేకూరుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. హనుమత్ ఆరాధన శుభప్రదం.
Pisces
మీనం: నూతన నిర్మాణ పనులు చేపడతారు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. సూర్యారాధన మేలుచేస్తుంది.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.