Devi Navaratrulu 2025
Devi Navaratrulu 2025: విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దసరా రోజున ఇంద్రకీలాద్రిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు.
శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరిని సమర్పిస్తారు. శాంత స్వరూపంతో అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడను చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమే రాజరాజేశ్వరీదేవి. అమ్మవారిని దర్శిస్తే అపజయం ఉండదని హిందువులు నమ్ముతారు.
బంగారు రంగుర చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ శక్తులను అమ్మవారు వరంగా అందిస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారిని పూజించాక లలితా సహస్ర నామ పారాయణం చేయాలి. కుంకుమార్చనలు, సువాసినీ పూజలు చేయొచ్చు. (Devi Navaratrulu 2025)
శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్‌తో పాటు అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది. అమ్మవారి అవతారం ముగిసిన అనంతరం శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు కూడా ముగుస్తాయి. దసరా సాయంత్రం నక్షత్ర దర్శనం సమయంలో జమ్మిచెట్టు (శమీవృక్షం) వద్ద అపరాజితాదేవిని పూజించాలి.
శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ!
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ!!
అనే శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మకు తగిలించాలి.
Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము. విశ్వసించాలా? వద్దా? అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.