×
Ad

Vijayadashami: విజయదశమి రోజున విజయ ముహూర్తం టైమింగ్స్ ఇవే.. ఈ సమయంలో ఏ పని చేసినా, ఏ వ్యాపారం ప్రారంభించినా తిరుగు లేదంతే..!

ఇది చాలా శక్తిమంతమైన సమయం. ఏడాదికి ఒకసారి వచ్చే సమయం. ఈ సమయంలో..

Vijayadashami: దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అక్టోబర్ 2న విజయ దశమి. విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా అంటే రాహు కాలంతో కానీ, దుర్ముహుర్తంతో కానీ, పంచాంగంతో కానీ సంబంధం లేకుండా విజయదశమి రోజున ఒక ప్రత్యేకమైన ముహూర్తంలో ఏ పని చేసినా సంవత్సరం మొత్తం అద్భుతం ఫలితాలు కలుగుతాయని, దాన్ని విజయ ముహూర్తం అనే పేరుతో పిలుస్తారని పరమ శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పారు. మరి విజయదశమి రోజున విజయ ముహూర్తం ఎప్పుడు వస్తుంది? ఆ సమయంలో ఏం చేయాలి? తెలుసుకుందాం..

విజయదశమి రోజున విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే మధ్యాహ్నం 2గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల మధ్యలో వచ్చిందని పండితులు తెలిపారు. ”ఈ 47 నిమిషాల పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది. ఇది చాలా శక్తిమంతమైన సమయం. ఏడాదికి ఒకసారి వచ్చే సమయం. ఈ సమయంలో ఏ వ్యాపారం ప్రారంభించినా ఏడాది మొత్తం తిరుగులేని విధంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్తగా ఒక పని ప్రారంభిస్తే విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది.

ఉద్యోగంలో చేరితే అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. విదేశీయాన ప్రయాణం పెట్టుకుంటే విదేశీయాన ప్రయాణం విజయవంతం అవుతుంది. అక్కడ అభివృద్ధి సాధిస్తారు. జీవితానికి సంబంధించి ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ముఖ్యమైన పని చేయాలన్నా అక్టోబర్ 2 విజయదశమి రోజున విజయ ముహూర్తంలో చేయండి” అని పండితులు తెలిపారు.