Weekly horoscope
Weekly horoscope: ఈ వారం (అక్టోబర్ 5 నుంచి 11 వరకు) మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది?
గురువు మిధునం శని మీనరాశిలో వక్రస్థితి
రాహుకేతువులు కుంభ సింహ రాశిలో
రవి కన్యలో
కుజ బుధులు తులా రాశిలో
శుక్రుడు సింహ, కన్యారాశిలో
చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశులలో
మేషం: సంతోషంగా ఉంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధనలాభము, సర్వత్రాశుభములు కలుగుతాయి. ధర్మకార్యచరణ, శారీరక సౌఖ్యం, వ్యాపార ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. గౌరీపుజ చేయడం వల్ల శుభములు కలుగుతాయి.
వృషభం: యత్నకార్యసిద్ధి, నూతన వస్త్ర ప్రాప్తి ధనధాన్యసమృద్ధి జరుగుతాయి. ఆరోగ్యం, వస్తు వులు కొనుగోలు, తీర్థయాత్రలు చేస్తారు. గౌరవహాని ఉంటుంది. ప్రయాణముల విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు నూతన ఆలోచనలు, వ్యాపార విస్తరణ ఉంటాయి. గణపతి ఆరాధన మంచిది.
మిధునం: పనులలో ఆలస్యం, స్త్రీల ద్వారా తగాదలు, మనఃశాంతి లోపించడం, మనస్తాపము, భయము, మనోవేదన, సరైన నిర్ణయము తీసుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. బంధు విరోధములు ఉంటాయి. వ్యాపారములో జాగ్రత్త అవసరము. ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక: బుద్ధి చాంచల్యము, రావలసిన బాకీలు వసూలు కాకపోవడం, ప్రయుణములలో ఇబ్బందులు, నీచ స్త్రీ మూలక కలహములు, జాయింటు వ్యాపారులతో ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిడి ఉంటాయి. ఆరోగ్యము కుదుట పడుతుంది. శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమము.
సింహం: పిత్రార్జితం కలిసి రావడం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగు పొరుగు వారితో అనుకూలము, సంతోషముగా ఉంటారు.
కన్యా: ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గౌరవం, వ్యాపారంలో ప్రతికూల ఫలితములు, ప్రతి విషయంలో అలజడులు, అకాల భోజనము వంటివి ఉన్నాయి. కార్లు కోనుగోలు చేయడం, సుఖనిద్ర కలగడం వంటివి జరుగుతాయి. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తులా: కష్టాలు, నష్టాలు, విందువినోదములు, వ్యాపార విస్తరణ, సుఖనిద్ర, వాహనసౌఖ్యం, నూతన లాభములు, స్థానచలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం, ధన ఆదాయం పెరగడం శుభవార్తలు, విదేశీయానం, ఆహార సంబంధ సమస్యలు, వృథా భ్రమణం ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. శుభఫలితములు కలుగుతాయి.
వృశ్చికం: నూతన వ్యాపారములు, అనారోగ్యం, వివాదములు, నూతన వ్యక్తుల పరిచయము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు శరీరశ్రమ, బదిలీలు, సంతానములోవిరోధము వంటివి జరుగుతాయి. వ్యాపార లాభములు కలుగుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు: బంధుమిత్ర వైరము, ప్రతి పనిలో ప్రతికూలత, ధనలాభం, వృత్తి ఉద్యోగములలో విజయం సాధించడం, మరిచిపోవడం అలసత్వం, ప్రయాణముల వలన లాభం కలగడం, సుఖనిద్ర, సమాజంలో గౌరవము దక్కుతాయి. శ్రీ మహాలక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
మకరం: విలువైన ఆభరణములు కొనడం, గృహ ఉపకరణ వస్తువులు కోవడం, కార్యములలో విజయం, శారీరక సౌఖ్యం, అన్నింటా అభివృద్ధి, ఆరోగ్యం కుదుటపడటం, నూతన వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము వంటివి జరుగుతాయి. లలితా సహస్ర నామ పారాయణము చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి
కుంభం: వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ అధికం, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖసంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము బంధుమిత్రుల గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల కలయిక, సహకారం వంటివి జరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.
మీనం: అకస్మిక ప్రయూణములు, స్థానచలనము, గృహములో మార్పులు, శుభ మూలక ధనవ్యయం, శుభకార్యసిద్ది, కోపంతో వివాదములు పెరుగడం వంటివి జరుగుతాయి. అకస్మిక ధనలాభం, స్త్రీ మూలక వివాదములు, రుణ బాధ నివృత్తి ఉంటాయి. సుందర కాండ పారాయణ చేయడం వల్ల శుభం కలుగుతుంది.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956