Kaal Sarp Yog (Image Credit To Original Source)
Kaal Sarp Yog: జ్యోతిష్యశాస్త్రంలో కాలసర్పయోగమనేది ఉంది. రాహుకేతువుల మధ్య సప్తగ్రహములుంటే దానిని కాలసర్పయోగము అంటారు. ఈ కాలసర్పయోగ ప్రస్తావన ప్రామాణికంగా రాసిన గ్రంథాలలో ఉన్నవే చదవడంకాదు దానిమీద పరిశోధన ఉండాలి. కొత్త అంశాన్ని వెలుగులోనికి తీసుకుని రావాలి. ఎంతోమంది వ్యక్తుల జాతకముల పరిశీలన చేయాలి.
ఒక వ్యక్తి M.Sc (Maths) చదువుతాడు.. అతను అంతటితో ఆగక Ph.D చేస్తాడు అక్కడ Ph.Dలో కేవలం Ph.D పుస్తకాలను అనుసరించడం కాదు. మ్యాథమాటిక్స్, కొంతవిషయాన్ని కనిపెట్టడం.. అది రీసెర్చ్. ఉదాహరణకు ఇంటర్ చదువుతున్న విద్యార్థి త్రికోణమితి (Trigonametry) లోని లెక్కలు చేస్తుంటే కేవలం ఆలెక్కలు IITలో రావు.
త్రికోణమితిలోని లెక్కలను ఆధారంగా చేసుకుని మెదడుకు మేత పెట్టే విధంగా రీసెర్చ్ లెవల్లో ప్రశ్నలు సంధిస్తారు. కేవలం ఆ చాప్టర్లో ప్రశ్నలు అడగడం బట్టిపట్టి రాయడం కాదు IIT స్థాయులో ప్రశ్నలు ఉంటాయి. ఎన్నో షార్ట్‌కట్స్ మెథడ్స్, లెక్చరర్స్ విద్యార్థులకు చెప్పని ప్రశ్నలు IIT పేపర్లలో ఉంటాయి.
ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే కేవలం ప్రామాణిక గ్రంథాలే తీసుకొని కొత్తగా వచ్చినవి తప్పు అనటం సరికాదు ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరిగింది. దానిని అనుసరించి వెళ్లాలి అలా అని ప్రామాణిక గ్రంథాలు తీసుకోగూడదని కాదు అవి ప్రామాణిక గ్రంథాలు అనుసరించాలి. వాటి మీద పరిశోధన చేసి క్రొత్తవిషయాలను కనిపెట్టాలి.
కాలసర్పయోగం దేశాల మీదేకాదు.. వ్యక్తులమీద ప్రభావము చూపుతుంది. జాతకంలో కాలసర్పయోగము ఉండి యోగము, అమలయోగం, లక్ష్మీయోగం మొదలగు శుభయోగములు (లేక) వివిధ బలమైన యోగములు అనగా గజకేసరి, బుధాదిత్య యోగం, చంద్రమంగళ భావములలో శుభగ్రహములు ఉంటే ఆజాతకునికి కాలసర్పయోగము ప్రభావము తగ్గుతుంది.
కొంతమంది జాతకంలో అధికంగా శుభయోగములు ఉంటే కాలసర్ప యోగము నిర్వీర్యము అవుతుంది. కొంతమంది అడుగుతుంటారు.. మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జాతకంలో కాలసర్పయోగం ఉందికదా, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ అధ్యక్షుడు జార్జిబుష్, పారిశ్రామికవేత్త ధీరూబాయ్ అంబానీ, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి వారందరూ కాలసర్పయోగ జాతకులే కాని ఒక విషయం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి.
వీరందరికి కాలసర్పయోగం ఉంది కదా? అందరూ మంచి హోదాలో ఉన్నారు కదా ఏమైంది? కాలసర్పయోగం వారిపై ప్రభావం చూపలేదు కదా అని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అసలు విషయం ఏమింటే.. వారి జాతకములను పరిశీలిస్తే జన్మకుండలిలో శుభయోగములు, వివిధ భావములలో శుభగ్రహముల కారణంగా కొన్ని జాతకములలో కాలసర్పయోగ ప్రభావము తగ్గింది.
అపసవ్య కాలసర్పయోగములు కూడా ఉన్నాయి. కొన్ని జాతకములలో కాలసర్పయోగ నిర్వీర్యము అయింది. ఇంకొక ప్రశ్న కూడా ఉంది. అసలు కాలసర్పయోగ రూపము ఏమిటి రాహుకేతువులు గ్రహముల మధ్య సర్వగ్రహములు ఉండటమే కాకుండా రాహువునకు ముందు, కేతువునకు వెనుక మాత్రమే గ్రహములుంటే దానిని కాలసర్పయోగము అంటారు.
ప్రతి సిద్ధాంతి రాహుకేతువుల మధ్య సప్తగ్రహములుంటే దానిని కాలసర్పయోగము అంటారని తెలుసు.. కానీ రాహువుకు ముందు, కేతువునకు వెనుక మాత్రమే గ్రహములుంటాయి.. అని జాతకమునను పరిశీలించడం లేదు.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ