New Honda Bikes
New Honda Bikes : హోండా వినియోగదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో దేశీయ మార్కెట్లోకి రెండు సరికొత్త హోండా బైకులు రానున్నాయి.
ప్రముఖ జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) రెండు సరికొత్త మోడళ్లను కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇందులో హోండా CB750 హోరెంట్ హై పెర్ఫార్మెన్స్ బైక్, హోండా ట్రాన్సాల్ప్ 750 అడ్వెంచర్ బైక్ ఉన్నాయి. ఈ రెండు బైకులను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది.
ఇప్పటికే, గుజరాత్‌లోని విఠలాపూర్ తయారీ ప్లాంటులో రూ.920 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హోండాకు భారత మార్కెట్లో 4 తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
అందులో తపుర్కర (రాజస్థాన్), మనేసర్ (హర్యానా), నరసిపుర (కర్ణాటక), విఠలాపూర్ (గుజరాత్)లలో ఉన్నాయి. ఈ తయారీ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 6.14 మిలియన్ యూనిట్లుగా ఉంది.
హోండా CB750 హోరెంట్ :
హోండా CB750 హోరెంట్ బైక్ సరికొత్త లుక్‌తో రానుంది. ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ 755cc ఇంజిన్, గరిష్టంగా 92bhp పవర్, 75Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, యూజర్ అనే 4 రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.
బ్లూటూత్-ఎనేబుల్డ్ TFT డిస్‌ప్లే , స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్, అసిస్ట్ క్లచ్ వంటి LED లైటింగ్ సిస్టమ్ ఫీచర్లు ఉండనున్నాయి.
బై డైరక్షనల్ క్విక్‌షిఫ్టర్ స్పెషల్ అట్రాక్షన్. CB750 హోరెంట్ CBU ఫుల్ బిల్ట్-అప్ యూనిట్‌గా ఇంపోర్ట్ అవుతుంది. మార్కెట్లో ఈ హోండా బైక్ ధర సుమారు రూ. 8.80 లక్షలు నుంచి రూ. 9.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చు.
హోండా ట్రాన్సాల్ప్ 750 :
కొత్త హోండా ట్రాన్సాల్ప్ 750 (Honda Transalp 750) బైక్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. నివేదికల ప్రకారం.. జూన్ లేదా జూలైలో మార్కెట్లోకి రావచ్చు.
ఈ అడ్వెంచర్ బైక్ అదే ఇంజిన్ కలిగి ఉండి, కాస్మెటిక్, మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండొచ్చు. బై-LED హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ విండ్‌స్క్రీన్ కూడా ఉండనున్నాయి. కొత్త సెంట్రల్ డక్ట్, స్విచ్ గేర్, 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటాయి.
Read Also : Apple iPhone 17 Air : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోందోచ్.. కెమెరా, ధర, డిజైన్ లీక్..!
ఈ హోండా బైక్ పియర్ డీప్ మడ్ గ్రే, రోజ్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ అనే 3 కలర్ స్కీమ్‌లలో రానుంది. కొత్త హోండా ట్రాన్సాల్ప్ 750 బైక్ 92bhp, 755cc ఇంజిన్ కలిగి ఉంటుంది. పాత మోడల్ ధరతోనే ఈ కొత్త బైక్ వచ్చే అవకాశం ఉంది.